KCR Kit Scheme For Pregnant Women In Telangana : తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన మరో పథకం కేసీఆర్ కిట్. తెలంగాణ సీఎం కేసీఆర్ పేరు మీదనే ఈ స్కీమ్ ను ప్రారంభించారు. ఈ స్కీమ్ ను 2017, జూన్ 2 సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అప్పట్లోనే ఈ స్కీమ్ కోసం రూ.605 కోట్ల నిధులను కేటాయించారు. గర్భిణీల కోసం, వాళ్ల డెలివరీ తర్వాత పాప, బాబు పుడితే వాళ్లకు కిట్ అందిస్తారు. అలాగే.. వాళ్ల పోషణ కోసం డబ్బులు కూడా ఇస్తారు. కాకపోతే గర్భిణీ అయినప్పటి నుంచి ఆ మహిళ ప్రభుత్వ ఆసుపత్రిలోనే ట్రీట్ మెంట్ తీసుకోవాలి. ప్రభుత్వ ఆసుపత్రిలోనే డెలివరీ కావాలి. అలాంటి మహిళలకే ఈ పథకం వర్తిస్తుంది. గర్భిణీలకు, అప్పుడు పుట్టిన పిల్లలకు కావాల్సిన సదుపాయాలు కల్పించడమే ఈ పథకం ఉద్దేశం.
డెలివరీ తర్వాత మహిళలకు, పుట్టిన బిడ్డ కోసం 16 రకాల వస్తువులతో కూడిన హైజీన్ కిట్ ను ప్రభుత్వం అందిస్తుంది. పిల్లలకు కావాల్సిన డైపర్లు, నాప్ కిన్స్, టాయ్స్, దోమ తెరలు, బేబీ పౌడర్, బేబీ సోప్, బేబీ ఆయిల్, డ్రెస్సులు అన్నీ ఉంటాయి. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం పెంచేందుకు, నవజాత శిశ మరణాల రేటును భారీగా తగ్గించేందుకే ప్రభుత్వం ఈ స్కీమ్ ను ప్రవేశపెట్టింది.
KCR Kit Scheme For Pregnant Women In Telangana : ఈ స్కీమ్‌కి ఎవరు అర్హులు?
ఈ స్కీమ్ కు గర్భిణీలే అర్హులు. కాకపోతే ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ కాగానే రిజిస్టర్ చేసుకొని అక్కడే డెలివరీ చేసుకోవాలి. అయితే.. ఒక్క మహిళకు రెండు డెలివరీలకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ కింద అర్హత సాధించాలంటే తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారే అయి ఉండాలి. తెలంగాణకు చెందిన ఆధార్ కార్డు ఉండాలి. ప్రైవేటు ఆసుపత్రుల్లో డెలివరీ చేస్తే ఈ స్కీమ్ కింద అర్హత సాధించలేరు.
హైజీన్ కిట్ తో పాటు పాప పుడితే తల్లి అకౌంట్ లో ప్రభుత్వం రూ.13 వేలు వేస్తోంది. బాబు పుడితే రూ.12 వేలు ఇస్తారు. అమ్మ ఒడి పథకం కింద తల్లి, బిడ్డను ఇంటి వద్ద డ్రాప్ చేస్తారు. కేసీఆర్ కిట్ కింద అర్హత పొందాలంటే.. మీకు దగ్గర్లోని పీహెచ్‌సీ సెంటర్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర పీహెచ్‌సీ సెంటర్ లేకపోతే ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నా అక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు.
ఈ స్కీమ్ గురించి మరిన్ని వివరాలు కావాలంటే kcrkit.telangana.gov.in అనే వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. లబ్ధిదారుల వివరాలన్నీ రిజిస్టర్ చేసుకొని బ్యాంకు వివరాలు తీసుకొని డిప్యూటీ డీహెచ్ఎంవో అప్రూవల్ చేస్తారు.