Electric Car : బుల్లి కారును ఎప్పుడైనా చూశారా? అది ఎంత చిన్నగా ఉంటుంది అంటే.. ఇద్దరు మాత్రమే అందులో కూర్చొని ప్రయాణించవచ్చు. పార్కింగ్ ప్రాబ్లమ్ కూడా ఉండదు. బైక్ ను పార్క్ చేసే ప్లేస్ లోనే ఇంకొంచెం ప్లేస్ ఉంటే చాలు. ఈ కారును పార్క్ చేయొచ్చు. అందులోనూ ఇది ఎలక్ట్రిక్ వాహనం కావడం వల్ల.. మైలేజ్ కూడా బాగానే వస్తుంది. ముఖ్యంగా నగర వాసులకు ఈ కారు చక్కగా సూట్ అవుతుంది.
ఈ కారు పేరు సిటీ ట్రాన్స్ ఫార్మర్ సీటీ 2 మినీ వెహికిల్. సీటీ 2 వాహనాన్ని సిటీ ట్రాన్స్ ఫార్మర్ అనే స్టార్టప్ కంపెనీ తయారు చేసింది. చిన్న చిన్న రోడ్ల మీద కూడా ఈ కారు దూసుకెళ్తుంది. దానికి కారణం.. ఇది చిన్నగా ఉండటం. నానో కారు కంటే కూడా ఈ కారు చాలా చిన్నగా ఉంటుంది. సింపుల్ గా తక్కువ దూరం ప్రయాణం చేసేవాళ్లకు ఇది సౌకర్యంగా ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలం, ఎండాకాలంలో ఈ కారు బాగా సూటవుతుంది.
Electric Car : ఈ కారు వెడల్పు మీటర్ మాత్రమే
ఈ కారు వెడల్పు ఒక మీటర్ మాత్రమే ఉంటుంది. దీని వల్ల చిన్న ప్లేస్ లో కూడా ఈ కారును పార్క్ చేసుకోవచ్చు. ఈ వెహికిల్ బరువు 450 కిలోలు ఉంటుంది. ఇందులో ఇద్దరు కూర్చొని ప్రయాణించవచ్చు. ఒక్కసారి ఈ కారును ఫుల్ చార్జ్ చేశామంటే.. 180 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుంది. గంటలకు 90 కిమీల టాప్ స్పీడ్ వరకు ఈ వాహనం వెళ్తుంది. సాధారణంగా మామూలు కార్లలో టాప్ స్పీడ్ 200 కిమీల వరకు ఉంటుంది. కానీ.. దీంట్లో టాప్ స్పీడ్ 90 కిమీలే. అది గంటకు. అయితే.. ఈ వాహనాలు ఇంకా సేల్స్ కు రాలేదు. ఇప్పుడే వీటి మోడల్ తయారు చేసి టెస్ట్ డ్రైవ్ చేస్తున్నారు. అంతా ఓకే అనుకుంటే.. 2024 లో ఈ వాహనాలను తయారు చేసి అమ్మకాలు ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. అన్నట్టు ఈ కారును భారత్ లోనూ విక్రయించేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఈ కారు ధర, ఇతర ఫీచర్స్ గురించి కూడా కంపెనీ ఇంకా వెల్లడించలేదు.