Maruti Alto 800 : మారుతీ సుజుకీ ఆటోమొబైల్ కంపెనీ నుంచి వచ్చిన ఆల్లో 800 కారు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ మోడల్ మధ్యతరగతి ప్రజల డ్రీమ్. బడ్జెట్ ధరలో లభించే మారుతీ ఆల్టో 800 కారు ఇక కనిపించదు. కారణం.. దాని ప్రొడక్షన్ ను కంపెనీ నిలిపివేసింది. ఈ మోడల్ ను కంపెనీ డిస్ కంటిన్యూ చేయాలని భావించింది. భారత్ మార్కెట్ లో ఆల్టోకి చాలా డిమాండ్ ఉంటుంది. దీని సేల్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ.. ఇప్పుడు ఆ మోడల్ ను కంపెనీ నిలిపేసింది.
ఇది హ్యాచ్ బ్యాక్ మోడల్ కారు. అత్యధిక సేల్స్ ఉన్న కారు కూడా ఇదే. కానీ.. బీఎస్ 6 ఫేజ్ 2 లోకి ఈ మోడల్ ను అప్ గ్రేడ్ చేయాలంటే చాలా సమస్యలు వస్తాయని కంపెనీ భావించి ఈ మోడల్ కారు ప్రొడక్షన్ ను నిలిపివేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
Maruti Alto 800 : ఇది ఎంట్రీ లేవల్ హ్యాచ్ బ్యాక్ మోడల్
ఇది ఎంట్రీ లేవల్ హ్యాచ్ బ్యాక్ మోడల్ కారు. ఈ మోడల్ కారు ధరలు రోజురోజుకూ పెరుగుతూ వెళ్తుండటం వల్ల దీని సేల్స్ కూడా పడిపోయాయి. ఆల్టో నుంచి వచ్చిన మరో మోడల్ కే10కి బాగా డిమాండ్ పెరగడంతో ఆల్టో 800కి డిమాండ్ తగ్గిపోయింది. ఈసమయంలో దీన్ని అప్ గ్రేడ్ చేయడం కన్నా… డిస్ కంటిన్యూ చేయడమే బెటర్ అని కంపెనీ భావించినట్టు తెలుస్తోంది. మారుతీ సుజుకీ అల్టో 800 ఎక్స్ షోరూ ధర బేసిక్ మోడల్ రూ.3.54 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.
796 సీసీ పెట్రోల్ ఇంజిన్, 48 పీఎస్ పవర్, 69 ఎన్ఎం పీక్ టార్క్ లాంటి ఫీచర్లతో ఉన్న ఈ కారును 2000 సంవత్సరంలో భారత్ లో లాంచ్ చేశారు. దాదాపు 10 ఏళ్ల పాటు భారత మార్కెట్ ను ఈ కారు శాసించింది. మధ్యతరగతి ప్రజలకు ఈ కారు బెస్ట్ ఆప్షన్ లా కనిపించింది. కానీ.. ఇప్పుడు ఈ కారు ఇక మార్కెట్ లో కనిపించదు. ఈ కారుకు బదులు ఆల్టో కే10 మోడల్ ను కొనుగోలు చేయొచ్చు.