Mini Africa In Hyderabad : ఎలగెలగా.. హైదరాబాద్ లో మినీ ఆఫ్రికానా. అదేంటి.. ఆఫ్రికా ఎక్కడో ఉంది. ఖండాంతరాలు దాటి వెళ్లాలి. కానీ.. హైదరాబాద్ లో ఆఫ్రికా ఉండటం ఏంటి అని మీరు షాక్ అయి ఉంటారు. కానీ.. మీరు చదివింది నిజమే. హైదరాబాద్ మహానగరంలో నడిబొడ్డున మినీ ఆఫ్రికా ఉంది. అక్కడికి వెళ్తే మనం హైదరాబాద్ లో ఉన్నామా.. లేక ఆఫ్రికా దేశంలో ఉన్నామా అనే డౌట్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అక్కడ ఎవరిని చూసినా ఆఫ్రికన్లే కనిపిస్తారు. హైదరాబాదీలు కనుచూపు మేర కూడా కనిపించరు.
అదే పారామౌంట్ హిల్ కాలనీ. అదెక్కడుంది అనకండి. హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ కి ఆనుకొని ఈ ఏరియా ఉంటుంది. జూబ్లీ హిల్స్ అంటే అందరికీ తెలుసు కదా. కానీ.. దాని పక్కనే ఒక మినీ ఆఫ్రికా ఉందని మాత్రం చాలామందికి తెలియదు. అదే పారామౌంట్ హిల్ కాలనీ. ఇది టోలీచౌకి పరిధి కిందికి వస్తుంది. దాన్ని మినీ ఆఫ్రికా అని ఎందుకు పిలుస్తారంటే అక్కడ ఉండేవాళ్లు అందరూ ఆఫ్రికన్లే కాబట్టి. అంటే.. హైదరాబాద్ కు వచ్చే ఆఫ్రికన్స్ అందరూ ఆ ఏరియాలోనే ఉంటారు.
Mini Africa In Hyderabad : ఎక్కువగా యువతే కనిపిస్తుంది
ఈ కాలనీలో ఆఫ్రికాకు చెందిన వారిలో ఎక్కువగా యూత్ కనిపిస్తారు. మన దగ్గర చదువు కోసం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద చదువులు కూడా తక్కువ ఖర్చులో చదివేయొచ్చు. ఆఫ్రికా దేశాల్లో అయ్యే ఖర్చుతో పోల్చితే ఇక్కడ తక్కువ. అలాగే.. మెడికల్ టూరిజంలోనూ ముంబై, చెన్నై తర్వాత హైదరాబాద్ మూడో ప్లేస్ లో ఉంది. ఇలా.. పలు రంగాల్లో జాబ్స్ ఇక్కడ పొందడం చాలా ఈజీ. అందుకే.. చాలామంది ఆఫ్రికన్లు చదువు, పని కోసం ఇక్కడికి వస్తుంటారు. కొన్ని దశాబ్దాల నుంచి ఈ ప్రాంతంలో ఆఫ్రికన్లు నివసిస్తున్నారు.
అందుకే ఆ ప్రాంతంలో ఆఫ్రికా వాతావరణమే కనిపిస్తుంది. అక్కడ ఉండే రెస్టారెంట్లలోనూ ఆఫ్రికా ఫుడ్ దొరుకుతుంది. అందరూ వాళ్ల దేశానికి చెందిన వాళ్లే అక్కడ ఉంటారు కాబట్టి కొత్తగా సిటీకి ఎవరైనా వచ్చినా అక్కడే ఉండేందుకు ఇష్టపడతారు. ఇతర ప్రాంతాలతో పోల్చితే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా తక్కువే. ప్రస్తుతం ఈ ప్రాంతంలో వేల మంది ఆఫ్రికన్ నివసిస్తున్నారు. ఇందులో సోమాలియా, సూడాన్, కెన్యా, నైజీరియా లాంటి దేశాల నుంచి ఎక్కువగా హైదరాబాద్ కు వస్తున్నారు. కొందరు పనుల కోసం వస్తే, మరికొందరు చదువుల కోసం వస్తారు. ఇంకొందరు వైద్యం కోసం నగరానికి వస్తుంటారు. అలా రోజురోజుకూ నగరానికి ఆఫ్రికన్లు వచ్చే సంఖ్య పెరుగుతోంది కానీ తగ్గడం లేదు.