Cheapest CNG Cars : ఒకప్పుడు పెట్రోల్, డీజిల్ కార్లకు బాగా డిమాండ్ ఉండేది. కానీ.. ఇప్పుడు కాలం మారింది బాస్. పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరగడంతో ఇక అందరి చూపు సీఎన్జీ, ఎలక్ట్రిక్ కార్లవైపు మళ్లింది. ఎలక్ట్రిక్ కార్లు చాలా బెస్ట్ కానీ.. మన దేశంలో సరైన చార్జింగ్ పాయింట్స్ లేకపోవడంతో ఎలక్ట్రిక్ కార్లు కొనాలంటే జనాలు భయపడుతున్నారు. వాటికి ప్రత్యామ్నాయంగా కనిపించేది సీఎన్జీ కారు మాత్రమే.
కానీ.. సీఎన్జీ కార్లు కూడా బాగా పిరం అయ్యాయి. దానికి కారణం.. సీఎన్జీ కార్లవైపు చాలామంది ప్రజలు మొగ్గు చూపడం. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలు బడ్జెట్ ధరలో దొరికే సీఎన్జీ కార్ల వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే.. మధ్య తరగతి ప్రజల కోసం బడ్జెట్ ధరలో దొరికే కార్లు ఏంటో చాలామందికి తెలియదు. మారుతీ సుజుకీలో ఆల్టో 800 లో సీఎన్జీ కారు బడ్జెట్ ధరలో లభిస్తుంది. దీని ఎక్స్ షోరూం ధర రూ.5.13 లక్షలే. మైలేజీ 30 కిమీలు వస్తుంది.
Cheapest CNG Cars : మారుతీ సుజుకీ ఎస్ ప్రెస్సో సీఎన్జీ వాహనం కూడా బెస్టే
రూ.6 లక్షలకే మారుతీ సుజుకీలో ఎస్ ప్రెస్సో సీఎన్జీ వాహనం దొరుకుతుంది. దీని మైలేజీ కేజీకి 32 కిమీలు వస్తుంది. మారుతీ సుజుకీలోనే ఆల్టో కే10 ధర రూ.5.96 లక్షలుగా ఉంది. మారుతీ సుజుకీ వాగనార్ ధర రూ.6.43 లక్షలు. టాటా టియాగో ఐసీఎన్జీ ఎక్స్ షోరూమ్ ధర రూ.6.44 లక్షలు, ఈ కారు ఎక్కువగా సేల్స్ అవుతున్నాయి. టాటా టియాగో ఐసీఎన్జీ మైలేజీ కేజీకి 26.49 కిమీలు ఉంటుంది. 72 బీహెచ్పీ పవర్, 95 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. వీటిలో ఏ కారు అయినా మధ్య తరగతి వాళ్లకు బెస్టే.