PM Berojgari Bhatta Yojana : మీకు ఉద్యోగం లేదా? నిరుద్యోగిగా చాలా ఏళ్ల నుంచి ఉంటున్నారా? ఏ జాబ్ కు దరఖాస్తు చేసినా జాబ్ రావడం లేదా? మీలాంటి వాళ్ల కోసమే ఈ స్కీమ్. మీలాంటి జాబ్ లేని వాళ్లను ఆర్థికంగా ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమ్ ఇది. దీని పేరు ప్రధాన మంత్రి బెరోజ్ గారి భట్టా యోజన స్కీమ్. ఒకరకంగా చెప్పాలంటే ఇది నిరుద్యోగ భృతిలా అనుకోవచ్చు. ఈ స్కీమ్ ను కేంద్రం తీసుకొచ్చినా ఆయా రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలే అమలు చేస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ స్కీమ్ అందుబాటులోకి వచ్చింది.
దీని కోసం మీరు ఈ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఎలాంటి జాబ్ లేకపోయినా, మీరు పేద కుటుంబానికి చెందిన వారు అయితే వెంటనే ఈ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వమే మీకు నెలకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు భృతి ఇస్తుంది. మీది ఏ రాష్ట్రం అయితే ఆ రాష్ట్రం పేరు గూగుల్ లో టైప్ చేసి బెరోజ్ గారి భట్టా యోజన అని టైప్ చేయండి. ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోండి. ఉదాహరణకు మీది తెలంగాణ అయితే ఆ రాష్ట్రానికి సంబంధించి సపరేట్ లింక్ ఇస్తారు. ఆ లింక్ ను క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి.
PM Berojgari Bhatta Yojana : కనీసం డిగ్రీ పూర్తి చేసి ఉంటేనే అర్హులు
ఈ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకోవాలంటే ఖచ్చితంగా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. వయసు కనీసం 21 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వరకు ఉండాలి. తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే చెందిన వారు అయి ఉండాలి. అంటే ఏ రాష్ట్రం వాళ్లు ఆ రాష్ట్రంలోనే దరఖాస్తు చేసుకోవాలి. డిగ్రీ లేకపోయినా డిప్లోమా కోర్సు, ఐటీఐ పాస్ అయిన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
అలాగే.. మీ కుటుంబంలో ఎవ్వరికీ ప్రభుత్వ ఉద్యోగం వచ్చి ఉండకూడదు. ఒకవేళ మీ ఫ్యామిలీలో ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఈ స్కీమ్ కి అర్హులు కారు. అలాగే మీ ఫ్యామిలీ సంవత్సర ఆదాయం సంవత్సరానికి 3 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉండాలి. ఇవన్నింటికి అర్హత కలిగి ఉంటే వెంటనే మీరు ఈ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకోండి.
తెలంగాణలో ఈ స్కీమ్ ప్రకారం నెలకు రూ.3016 నిరుద్యోగ భృతి అందిస్తారు. అయితే.. ఇంకా నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు. దాని కోసం ప్రభుత్వం రూ.1810 కోట్ల బడ్జెట్ ను కూడా ఏర్పాటు చేసింది.