Ram Gopal Verma : సీఎం కేజ్రీవాల్ గారు పాకిస్తాన్ గెలవాలని కోరుకుంటారా ? అంటూ వర్మ సంచలన ట్వీట్

Bharath Cine Desk

Ram Gopal Verma : ఆదివారం జరిగిన భారత్ పాకిస్తాన్ తొలి పోరులో భారత్ ను చిత్తుచిత్తుగా ఓడించి పాకిస్తాన్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. భారత్ ఓటమి క్రికెట్ ప్రేక్షకులను ఘోరంగా నిరాశపరిచింది అని చెప్పవచ్చు. పాకిస్తాన్ పై భారత్ కి అద్భుతమైన గెలుపు రికార్డు ఉండడంతో ఈసారి కూడా గెలుస్తుందని అందరూ ఊహించారు. కానీ పాకిస్థాన్ మాత్రం మ్యాచ్ గెలవాలని రెట్టింపు ఉత్సాహంతో బరిలో దిగింది. దీంతో ప్రపంచ కప్ లో మొదటి సారి భారత్ పై ఘన విజయం నమోదు చేసుకుంది.

ఈ మేరకు పలువురు ప్రముఖులు ఓటమిపాలైన భారత్ కు సంపూర్ణ మద్దతు అందజేశారు. ఇందులో భాగంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గెలుపు ఓటములు సహజమని.. ప్రపంచ కప్ లో గెలుపు కోసం పోరాడాలని.. రాబోయే ఈ మ్యాచ్లో భారత్ ఘనవిజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్వీట్ చేశారు.

Ram Gopal Verma : సీఎం కేజ్రీవాల్ గారు పాకిస్తాన్ గెలవాలని కోరుకుంటారా ? అంటూ వర్మ సంచలన ట్వీట్
Ram Gopal Verma : సీఎం కేజ్రీవాల్ గారు పాకిస్తాన్ గెలవాలని కోరుకుంటారా ? అంటూ వర్మ సంచలన ట్వీట్

ఈ సందర్భంగా కేజ్రివాల్ చేసిన ట్వీట్ పై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. మ్యాచ్ లో ఒక వేళ పాకిస్థాన్ ఓడిపోతే ఈ విధంగానే పాకిస్థాన్ కి చెప్పేవారా? కేజ్రివాల్ అంటూ సంచలన ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై కేజ్రివాల్ స్పందించకపోయినా.. ఆయన అభిమానులు మాత్రం వర్మ పైన దుమ్మెత్తి పోస్తున్నరు… బుర్ర సరిగా పని చేయట్లేదనా ? అని కామెంట్ల ద్వారా విరుచుకుపడుతున్నారు.

- Advertisement -