redmi 43 4k ultra hd tv with huge discount in amazon sale

Amazon Festival Sale 2023 : దసరా సీజన్ స్టార్ట్ అయింది. దసరా పండుగ అంటేనే మామూలుగా ఉండదు మరి. షాపింగ్ లు గట్రా ఉంటాయి. మనకు దసరా పండుగే అతి పెద్ద పండుగ. దాని తర్వాతనే మరే పండుగ అయినా. అందుకే.. దసరా పండుగ సందర్భంగా షాపింగ్ చేస్తుంటారు. కొత్త బట్టలు, కొత్త వస్తువులు తీసుకుంటూ ఉంటారు. అందుకే ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్ కార్ట్, అమెజాన్ ఫెస్టివల్ సేల్ ను స్టార్ట్ చేశాయి. ఎలక్ట్రానిక్స్, గ్యాడ్జెట్స్, ఫోన్లు, ఇతర వస్తువుల మీద భారీ డిస్కౌంట్స్ లభించనున్నాయి. అందుకే ఓవైపు దసరా పండుగ.. మరోవైపు షాపింగ్ పండుగ ప్రారంభం కానుంది. అమెజాన్ సేల్ లో భాగంగా భారీ ఆఫర్లను తీసుకొచ్చింది. టాప్ బ్రాండ్స్ పై భారీగా డిస్కౌంట్స్ అందిస్తున్నారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలపై అమెజాన్ స్పెషల్ డిస్కౌంట్లను అందిస్తోంది.

సామ్ సంగ్, వన్ ప్లస్, ఎల్ జీ, షియోమీ, ఎంఐ, రెడ్మీ టీవీలపై భారీగా అమెజాన్ డిస్కౌంట్లను అందిస్తోంది. 50 శాతానికి పైగా స్మార్ట్ టీవీలపై డిస్కౌంట్లను అందిస్తోంది అమెజాన్. ఈ సేల్ లో భాగంగా రెడ్‌మీ 43 ఇంచ్ 4కే టీవీపై భారీ డిస్కౌంట్ ను అందిస్తోంది. రూ.43 వేల రూపాయల ఎంఆర్పీ ఉన్న టీవీని కేవలం రూ.20 వేలకే అందిస్తోంది. ఎలాంటి ఎక్స్‌ఛేంజ్ లేకున్నా ఆ ఆఫర్ తో పొందొచ్చు. ఒకవేళ ఎక్స్‌ఛేంజ్ ఉంటే అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అదనంగా రూ.5 వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చు. అంటే రూ.15 వేలకే రెడ్‌మీ టీవీని పొందొచ్చు.

Amazon Festival Sale 2023 : రెడ్‌మీ 43 4కే టీవీ ఫీచర్స్ అదుర్స్

ఇక.. రెడ్‌మీ 43 ఇంచ్ 4కే అల్ట్రా టీవీ ఫీచర్స్ చూస్తే అదుర్స్ అంటారు. 4కే అల్ట్రా హెచ్‌డీ 3840 * 2160 రిజల్యూషన్, 60 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, డ్యుయల్ బాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3 హెచ్‌డీఎంఐ పోర్టులు, హార్డ్ డ్రైవ్స్, 2 యూఎస్‌బీ పోర్ట్స్, డాల్బీ అట్మాస్ పాస్ త్రో ఈఆర్క్ హెచ్‌డీఎంఐ పోర్ట్, ఆప్టికల్ పోర్ట్, 30 వాట్స్ అవుట్ పుట్, డాల్బీ ఆడియో, డీటీఎస్ వర్చువల్ ఎక్స్, డాల్బీ అట్మాస్ ఈఆర్క్, డీటీఎస్ హెచ్డీ, ఆండ్రాయిడ్ టీవీ 10, 4కే ఎల్ఈడీ ప్యానెల్, సపోర్టింగ్ ఓటీటీ యాప్స్ లాంటి ఫీచర్స్ రెడ్‌మీ 43 4కే టీవీలో ఉన్నాయి. 20 వేలకే ఇన్ని అత్యాధునిక ఫీచర్లతో స్మార్ట్ టీవీ దొరకడం చాలా కష్టం. అందుకే 43 వేల టీవీని కేవలం 20 వేలకే అమెజాన్ సేల్ లో అందిస్తున్నారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on అక్టోబర్ 8, 2023 at 11:42 ఉద.