Swiggy Order : ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్స్ ఈ మధ్య బాగా పెరిగాయి. కరోనా వచ్చినప్పటి నుంచి ఆన్ లైన్ ఆర్డర్స్ పెరిగాయి. ఉప్పు ప్యాకెట్ కావాలన్నా.. టిఫిన్ కావాలన్నా.. కూరగాయలు కావాలన్నా.. ఏదైనా ఇప్పుడు ఆన్ లైన్ లోనే. ఆన్ లైన్ లో ఆర్డర్ చేసి ఇంటి వద్దకే అన్నీ తెప్పించుకుంటున్నారు జనాలు. అయితే.. ఎవరైనా ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేయాలంటే ఎంత వరకు చేస్తారు. ఎక్కువ మంది ఉంటే 10 ప్లేట్స్ అనుకోండి. సరే.. రూ.50 వేల డబ్బులను ఆన్ లైన్ ఆర్డర్ కు ఎవరైనా ఖర్చు పెడతారా? పోనీ.. లక్ష. కానీ.. ఓ వ్యక్తి ఏకంగా రూ.6 లక్షల విలువైన ఇడ్లీని ఆర్డర్ చేశాడు. షాక్ అయ్యారు కదా. మీరు షాక్ అయినా అదే నిజం.
సౌత్ ఇండియాలో పాపులర్ టిఫిన్ ఏది అంటే టక్కున ఇడ్లీ అని చెబుతారు. ఇడ్లీ అంటే అంత ఇష్టం సౌత్ ఇండియన్స్ కి. ఇవాళ ప్రపంచ ఇడ్లీ దినోత్సవం సందర్భంగా స్విగ్గీలో ఓ వ్యక్తి ఆర్డర్ చేసిన విషయం గురించి చెప్పుకొచ్చింది కంపెనీ. గత సంవత్సరంలో భారత్ లో 33 మిలియన్ల ప్లేట్ల ఇడ్లీని స్విగ్గీలో ఆర్డర్ చేశారట. 33 మిలియన్ అంటే 3.3 కోట్ల ప్లేట్లు అన్నమాట.
Swiggy Order : సంవత్సరం మొత్తంలో 6 లక్షల విలువైన ఇడ్లీని ఆర్డర్ చేశాడట
హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి.. గత సంవత్సరంలో అంటే 2022 లో రూ.6 లక్షల విలువైన ఇడ్లీలను ఆర్డర్ చేశాడట. అతడు కేవలం హైదరాబాద్ నుంచి ఇడ్లీలను ఆర్డర్ చేయలేదు. అతడు భారత్ మొత్తం తిరిగినప్పుడు ఎక్కడికి వెళ్తే అక్కడ స్విగ్గీలో ఇడ్లీలను ఆర్డర్ పెట్టేవాడు. గత సంవత్సరంలో 8428 ప్లేట్ల ఇడ్లీలను ఆర్డర్ చేశాడట. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లో ఎక్కువగా ఇడ్లీలను ఆర్డర్ చేశాడట. ఇక.. ఇండియా మొత్తంలో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై, కొయంబత్తూరులో ఎక్కువగా ఇడ్లీ ఆర్డర్ చేశారట. బెంగళూరు వాళ్లు రవ్వ ఇడ్లీ, చెన్నై వాళ్లు నెయ్యి, పొడి ఇడ్లీ, హైదరాబాద్ వాళ్లు కారంపొడి నెయ్యి ఇడ్లీ, ముంబై వాళ్లు ఇడ్లీ వడను ఎక్కువగా ఆర్డర్ చేశారట. ఇక.. ఇడ్లీ తర్వాత అంతటి ఎక్కువ స్థాయిలో ఆర్డర్ అయిన బ్రేక్ ఫాస్ట్ మసాలా దోశ.