tata tiago electric vehicles sales begin

Tata Tiago EV : టాటా టియాగో కార్లు మన దగ్గర సూపర్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. మధ్యతరగతి ప్రజలకు ఈ కారు బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే బడ్జెట్ ధరలో ఈ కారును కొనుగోలు చేయొచ్చు. అయితే.. ఇదే మోడల్ లో ఎలక్ట్రిక్ కారును కూడా టాటా కంపెనీ తీసుకొచ్చింది. టాటా టియాగో ఈవీ కారును లాంచ్ చేసింది. వెంటనే బుకింగ్స్ కూడా ప్రారంభించింది. త్వరలోనే ఈవీ కార్లు డెలివరీని స్టార్ట్ చేయనున్నట్టు కంపెనీ తెలిపింది.

తొలి బ్యాచ్ లో భాగంగా 2000 యూనిట్స్ ను 133 నగరాల్లో టాటా డెలివరీ చేయనుంది. ప్రస్తుతం జనాలు కూడా టియాగో ఈవీని కొనడానికే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఇది హ్యాచ్ బ్యాక్ కారు. ఈ కారుకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో బుకింగ్స్ ప్రారంభం అయిన 24 గంటల్లోనే 10 వేల బుకింగ్స్ అయ్యాయి. ఇప్పటి వరకు 20 వేల బుకింగ్స్ అయినా.. మొత్తం డబ్బులు కట్టిన వాళ్లే ఈ కారును ముందు డెలివరీ చేయనున్నారు. బుకింగ్ కోసం కేవలం నామమాత్రపు డిపాజిట్ ను కంపెనీ పెట్టింది. కారు డెలివరీ కోసం పూర్తి డబ్బును చెల్లించాల్సి ఉంటుంది.

Tata Tiago EV : రూ.8 లక్షలకే టాటా టియాగో ఈవీ కారు సొంతం

ఈ కారు బేసిక్ మోడల్ ధర రూ.8.49 లక్షలుగా ఉంది. హైఎండ్ కారు ధర రూ.11.79 లక్షలు ఉంది. ఈ ధరను తొలి 20 వేల బుకింగ్స్ కు మాత్రమే అప్లికబుల్ అవుతాయి. అంటే.. 20 వేల బుకింగ్స్ దాటిన వాళ్లకు వేరే ధర ఉంటుంది. ఒకవేళ 20 వేల బుకింగ్స్ లో ఎవరైనా మధ్యలో క్యాన్సిల్ చేసుకుంటే.. 20 వేల తర్వాత బుక్ చేసుకున్న వాళ్లకు ప్లస్ అవుతుంది. అందుకే.. వెంటనే మీరు ఈ కారుకు బుక్ చేసుకుంటే తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. లేట్ చేసే కొద్దీ కారు ధర పెరుగుతుంది. ఈ కారులో రెండు బ్యాటరీలు ఉంటాయి. ఒకటి 19.2 కేడబ్ల్యూహెచ్, రెండోది 24 కేడబ్ల్యూహెచ్ ఉంటాయి.