Top 5 Business Ideas Under Rs 20000 : జాబ్ ఎవ్వరైనా చేస్తారు. కానీ.. బిజినెస్ అనేసరికి చాలామంది వెనక్కి వెళ్తారు. బిజినెస్ అనేది అందరికీ చేతకాదు. కొందరి దగ్గర పెట్టుబడి ఉండదు. కొందరి దగ్గర బిజినెస్ ఐడియా ఉండదు. కొందరి దగ్గర రెండూ ఉన్నా చివరకు ముందడుగు వేసే ధైర్యం ఉండదు. ఇలా.. బిజినెస్ చేయాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. నష్టం వచ్చినా భరించే శక్తి ఉండాలి. అందుకే చాలామంది బిజినెస్ అనే సరికి వెనుకడుగు వేస్తుంటారు. కానీ.. ఉద్యోగం అలా కాదు.. ఒక్కసారి ఉద్యోగం వస్తే నెలంతా కష్టపడితే ఒకటో తారీఖున కంపెనీ ఇంత జీతం వేస్తుంది. మళ్లీ ఒకటో తారీఖు వచ్చే వరకు ఆ జీతాన్ని సరిపెట్టుకోవాలి. జాబ్ లో రిస్క్ తక్కువ.. జీతాలు కూడా తక్కువే ఉంటాయి. కానీ.. వ్యాపారం అంటే అలా కాదు. అందులో రిస్క్ ఎక్కువ. వ్యాపారం సెట్ అయితే లాభాలు కూడా ఎక్కువే వస్తాయి.
అయితే.. చాలామందికి వ్యాపారం చేయాలని ఉంటుంది కానీ.. ఏ వ్యాపారం చేయాలి అనేదానిపై క్లారిటీ ఉండదు. అటువంటి వాళ్ల కోసమే ఈ కథనం. కేవలం రూ.20 వేలు మాత్రమే కాదు.. అంత కంటే తక్కువ పెట్టుబడి పెట్టి వెంటనే డబ్బులు వచ్చేటువంటి బిజినెస్ లు చాలా ఉన్నాయి. అందులో టాప్ 5 బిజినెస్ ఐడియాలు ఏంటో తెలుసుకుందాం రండి.
Top 5 Business Ideas Under Rs 20000 : హ్యాండ్ మేడ్ క్యాండిల్స్ గురించి విన్నారా ఎప్పుడైనా?
హ్యాండ్ మేడ్ క్యాండిల్స్ బిజినెస్ అనేది చాలా తక్కువ పెట్టుబడితో స్టార్ట్ అవుతుంది. అందులోనూ ఇంట్లో ఉండే ఈ బిజినెస్ చేసుకోవచ్చు. ఈరోజుల్లో క్యాండిల్స్ అందరూ ఉపయోగిస్తారు. బర్త్ డే వేడుకల్లో, పలు కార్యక్రమాల్లో, డెకరేట్ చేసేటప్పుడు క్యాండిల్స్ ను ఉపయోగిస్తుంటారు. పండుగ సమయాల్లో క్యాండిల్స్ కు బాగా డిమాండ్ ఉంటుంది. అందుకే.. ఇంట్లోనే తక్కువ పెట్టుబడితో ఈ బిజినెస్ ను స్టార్ చేసుకోవచ్చు. దీని మెటీరియల్ ఒక్కసారి తెచ్చుకొని ట్రెయినింగ్ తీసుకుంటే చాలు. మార్కెటింగ్ కూడా అవసరం లేదు. వాళ్లే వచ్చి క్యాండిల్స్ కొనుక్కొని వెళ్తారు.
పచ్చళ్ల బిజినెస్
చాలామంది పచ్చళ్ల బిజినెస్ అని తక్కువ చేస్తుంటారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు తెచ్చే బిజినెస్ ఇది. ప్రతి ఇంట్లో పచ్చళ్లు ఖచ్చితంగా ఉంటాయి. ఒకప్పుడు ఇంట్లో చాలా పచ్చళ్లు చేసుకునే వారు. కానీ.. ఇప్పుడు కాలం మారింది. పచ్చళ్లు తయారు చేసుకునే సమయం ఎవ్వరికీ లేదు. అందుకే.. రెడీ మెడ్ పచ్చళ్లకు గిరాకీ పెరిగింది. కనీసం రూ.20 వేలు పెట్టుబడి పెడితే చాలు. మీరు పచ్చళ్ల బిజినెస్ ను స్టార్ట్ చేసుకోవచ్చు.
కంటెంట్ రైటింగ్
మీరు క్రియేటివ్ గా ఆలోచిస్తారా? మీకు ఏదైనా ఒక టాపిక్ గురించి రాసే సత్తా ఉందా? అయితే.. కంటెంట్ రైటింగ్ అనే బిజినెస్ మీకోసమే. కంటెంట్ రైటింగ్ కోసం పెట్టుబడి ఏం ఉండదు. మీకు ఆ స్కిల్ ఉంటే చాలు. ఫ్రీలాన్సర్ గా మీరు వర్క్ చేస్తూ డబ్బులు సంపాదించుకోవచ్చు.
డే కేర్ సర్వీసెస్
ఈరోజుల్లో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేసేవాళ్లే. అటువంటి వాళ్లు తమ పిల్లలను ఆఫీసులకు తీసుకెళ్లలేరు. అటువంటప్పుడు డే కేర్ సెంటర్ లో పిల్లలను వదిలేస్తుంటారు. అందుకే డే కేర్ సెంటర్ కు ఈ మధ్య బాగా డిమాండ్ పెరిగింది. డే కేర్ సెంటర్ కు పెద్దగా పెట్టుబడి కూడా అవసరం లేదు. రూ.20 వేల లోపే ఒక రూమ్ అద్దెకు తీసుకొని.. కావాల్సిన మౌలిక వసతులు ఏర్పాటు చేసుకొని ఒక ఆయమ్మను పెట్టుకుంటే చాలు. డే కేర్ సెంటర్ ద్వారా చాలా డబ్బులు సంపాదించవచ్చు.
మొబైల్ రిపేర్ సర్వీస్
మొబైల్ రిపేర్ కు సంబంధించిన స్కిల్ మీ దగ్గర ఉంటే.. మొబైల్ రిపేర్ సర్వీస్ సెంటర్ పెట్టుకోవచ్చు. దీనికి పెద్దగా పెట్టుబడి కూడా అవసరం లేదు. రూ.20 వేల కంటే తక్కువ పెట్టుబడితోనే ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఒక చిన్న షటర్ కిరాయికి తీసుకొని మొబైల్ సర్వీస్ సెంటర్ పెట్టుకుంటే చాలు. నెలకు బాగానే సంపాదించవచ్చు.