Viral News : ప్రేమంటే ఇదేనేమో… పంది పిల్లకు పాలు ఇచ్చిన కుక్క!

Balu

Viral News : ఈ రోజుల్లో సొంత కుటుంబ సభ్యులే కలిసి ఉండటం లేదు. చిన్న చిన్న విషయాలకు గొడవ పడుతూ పంతం నెగ్గించుకుంటున్నారు. నువ్వునేనా అంటూ బంధాలను మరిచిపోతున్నారు. సొంతవారిని కూడా చూడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మనుషుల్లో మానవత్వం ఇసుమంతైనా కనిపించని ఈ రోజుల్లో జంతువుల ప్రేమ వెలకట్టలేనిది. మనుషుల కన్నా జంతువులే బెటర్ అని చెప్పక తప్పదు. జాతివైరం మరిచి స్నేహంగా కలిసి మెలసి ఉంటాయి. కొన్ని జంతువుల పిల్లలు.. ఇతర జంతువుల చెంతకు చేరి పాలు తాగి తమ ఆకలి తీర్చుకున్న సందర్భాలను చూశాం.

పంది పిల్లకు పాలు పట్టి..

పందులు, కుక్కలు.. ఒకదానికొకటి వేర్వేరు జాతులు. కనీసం ఒక చోట ఉండటానికి కూడా ఇష్టపడవు. కానీ ఈ సంఘటన గురించి తెలసుకుంటే మనుషుల కన్నా జంతువులే బెటర్ అని అంటారు. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో విచిత్రమైన సంఘటన జరిగింది. రోడ్డు పక్కన ఓ పంది పిల్ల ఉంది. అదే సమయంలో అటుగా ఓ కుక్క వెళ్లింది. కుక్కను చూడగానే పంది ఒక్కసారిగా దానికి దగ్గరి వెళ్లి పాలు తాగింది. కుక్క కూడా కరవకుండా పంది పిల్లకు పాలిచ్చింది. పాలు సరిపోయి కదా అని కుక్క దూరంగా వెళ్లగానే మళ్లీ పంది పిల్ల వచ్చి పాలు తాగడం మొదలుపెట్టింది.

సోషల్ మీడియాలో వైరల్

ప్రధాన రోడ్డు మీదు ఓ పంది పిల్ల కుక్క పాలు తాగడంతో ప్రజలు ఆశ్చర్యపోయారు. తమ దగ్గర మొబైల్స్  బయటకు తీసి వీడియోలు, ఫొటోలు తీశారు. కొంతమంది సోషల్ మీడియాలో పెట్టడంతో కొద్ది నిమిషాల్లో వైరల్ గా మారింది. విషయం తెలుసుకున్న చాలామంది ఈ ఘటన స్థలానికి చేసుకొని వింతగా తిలకించారు.

- Advertisement -