Petrol Pumps : ఈరోజుల్లో పెట్రోల్ కొట్టించుకోవడం అనేది చాలా కామన్. బైక్, కారు, ఇతర వాహనాలు ఉన్నవాళ్లు తరుచూ పెట్రోల్ పంప్ కి వెళ్తుంటారు. పెట్రోల్ లేదా డీజిల్ కొట్టించుకొని వస్తాం. కానీ.. అసలు పెట్రోల్, డీజిల్ కొట్టించుకునే ముందు అక్కడ ఈ విషయాన్ని మాత్రం ఎవ్వరూ గమనించరు. ఎందుకంటే అసలు ఆ విషయం చాలామందికి తెలియదు. పెట్రోల్ కొట్టించుకునేటప్పుడు అక్కడ ఈ విషయాన్ని గమనించకపోతే అడ్డంగా మోసపోతాం. అంతే కాదు.. మన వాహనాలు కూడా త్వరగా పాడయ్యే ప్రమాదం ఉంటుంది.
పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించే పంప్ వద్ద నాలుగు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి అమౌంట్, రెండు లీటర్స్, మూడోది డెన్సిటీ, నాలుగోది లీటర్ కి ఎంత ధర అనే నాలుగు ఆప్షన్స్ ఉంటాయి. అయితే.. మనం ఎన్ని లీటర్లు, ఎంత ధర అయింది.. లీటర్ కు ఎంత ధర అనే ఆప్షన్లు మాత్రమే చెక్ చేస్తాం కానీ.. మూడో ఆప్షన్ ను మాత్రం చెక్ చేయం. మూడో ఆప్షన్ ఏంటో తెలుసా? డెన్సిటీ.. డెన్సిటీ అంటే ఏంటి అంటారా? ప్రతి వస్తువుకు ఒక క్వాలిటీ అనేది ఉంటుంది. అలాగే.. పెట్రోల్, డీజిల్ కు కూడా ఒక క్వాలిటీ ఉంటుంది. ఆ క్వాలిటీని చెప్పేదే ఈ డెన్సిటీ.
Petrol Pumps : డెన్సిటీ ఎంత ఉంటే నాణ్యమైన పెట్రోల్ అని అనుకోవాలి?
సాధారణంగా పెట్రోల్ డెన్సిటీ 710 నుంచి 770 మధ్య ఉండాలి. అదే డీజిల్ డెన్సిటీ 820 నుంచి 860 మధ్య ఉండాలి. పెట్రోల్ డెన్సిటీ 710 కంటే తక్కువ ఉన్నా.. 770 కంటే ఎక్కువ ఉన్నా కూడా అక్కడ మీరు పెట్రోల్ అస్సలు కొట్టించుకోకండి. ఎందుకంటే.. ఆ పెట్రోల్ లో సరైన నాణ్యత లేదు అని అనుకోవాలి. లేదా ఆ పెట్రోల్ లో ఏదైనా కలిపి ఉండొచ్చు.
అదే డీజిల్ డెన్సిటీ 820 కంటే తక్కువ ఉన్నా.. 860 కంటే ఎక్కువ ఉన్నా కూడా మీరు అక్కడ డీజిల్ కొట్టించుకోకండి. దాని డీజిల్ నాణ్యత లేనిదిగా భావించాలి. ఒకవేళ మీరు ఆప్షన్ లేక అక్కడే పెట్రోల్ లేదా డీజిల్ కొట్టించుకున్నా పెట్రోల్ నాణ్యత లేని కారణంగా వాహనాలు కూడా త్వరగా పాడవుతుంటాయి.
కొందరు పెట్రోల్ ను కల్తీ చేస్తారు. అప్పుడు డెన్సిటీ ద్వారా అసలు పెట్రోల్ కల్తీ అయిందో లేదో ఈజీగా తెలుసుకోవచ్చు. అందుకే కల్తీ పెట్రోల్ పోయించుకుంటే త్వరగా వాహనాలు పాడవుతాయి. అందుకే.. పెట్రోల్ కొట్టించేటప్పుడు ఒక్క సెకన్.. డెన్సిటీ ఎంత ఉందో చెక్ చేసుకొని పెట్రోల్ కొట్టించుకోండి.