Significane and Tarpan Vidhi of Pitru Paksh Amavasya 2023 : దసరా ముందు వచ్చే అమావాస్యకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఆ అమావాస్యను పితృ పక్ష అమావాస్య అంటారు. ప్రతి సంవత్సరం దసరా ముందు వచ్చే అమావాస్య నాడు పితృదేవతలకు తద్దినం పెడతారు. ఆ రోజు పెడితే వాళ్లకు మోక్షం కలుగుతుందని.. వాళ్ల ఆత్మ శాంతిస్తుందని, పితృ దేవతల ఆశీర్వాదం మన మీద ఉంటుందని నమ్మకం. అందుకే పితృ దేవతలకు ఆరోజున పితృ తర్పణం చేస్తారు. అయితే.. ఈ సంవత్సరం పితృ పక్ష అమావాస్య ఎప్పుడు వస్తోంది. ఏ టైమ్ లో చేయాలి. ఎప్పుడు చేయాలి. ఆరోజు విశిష్టత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అక్టోబర్ 14 అంటే శనివారం పితృ పక్ష 2023 కు ముగింపు రోజు. దేవి పక్షం ఆరోజు నుంచే ప్రారంభం అవుతుంది. 16 లూనార్ రోజుల సమయంలో అమావాస్య తిథి నాడు పితృ పక్ష పూర్తవుతుంది. ఆ రోజు నాడే హిందువులు తమ పితృదేవతలకు, తమ తాతలు, ముత్తాతలకు బియ్యం ఇస్తారు. తద్దినం నిర్వహిస్తారు. పితృ పక్ష అమావాస్యనే సర్వ పితృ అమావాస్య అని కూడా పిలుస్తాం. మహాలయ అమావాస్య అని కూడా పిలుస్తాం. ఆ రోజునే తర్పణం అర్పిస్తారు. ఉదయమే పితృ తర్పణం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
Significane and Tarpan Vidhi of Pitru Paksh Amavasya 2023 : ఏ రోజున ఏ సమయలో అమావాస్య తిథి ప్రారంభం అవుతోంది?
అక్టోబర్ 13న రాత్రి 9.50 కి అమావాస్య తిథి ప్రారంభం అవుతుంది. అక్టోబర్ 14న రాత్రి 11.24 నిమిషాలకు అమావాస్య తిథి పూర్తవుతుంది. కుటుప్ ముహూర్తం అక్టోబర్ 14న ఉదయం 11.09 నిమిషాలకు స్టార్ట్ అయి 11.56 ఏఎంకు పూర్తవుతుంది. రోహిన ముహూర్తం అక్టోబర్ 14న ఉదయం 11.56 నిమిషాలకు ప్రారంభమై.. మధ్యాహ్నం 12.43 నిమిషాలకు పూర్తవుతుంది. అపరహ్న కాల్ ముహూర్తం అక్టోబర్ 14న మధ్యాహ్నం 12.43 నిమిషాలకు ప్రారంభమయి.. మధ్యాహ్నం 3.04 నిమిషాలకు పూర్తవుతుంది.
పితృ పక్షం రోజు చేయాల్సిన కార్యక్రమాలు ఇవే
పితృ పక్షం రోజున ఆ ఇంటికి పెద్ద కొడుకు ఉదయమే లేచి పవిత్ర స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని పూజ నిర్వహించాలి. మీ తాత, ముత్తాతల ఫోటోలను ఒక టేబుల్ మీద దక్షిణం వైపు పెట్టాలి. నల్లని నువ్వులు, బార్లీ గింజలు పెట్టాలి. నెయ్యి, తేనె, బియ్యం, మేక పాలు, చెక్కర, బార్లీతో చేసిన అన్నాన్ని ముద్దలుగా చేయాలి. అలాగే.. పిండి, బార్లీ, కుష్, నల్లని నువ్వులతో చేసిన తర్పణాన్ని కూడా అక్కడ పెట్టుకొని ఆ తర్వాత వాటిని ఎవరైనా పేదలకు ఇవ్వాలి. దీంతో పితృ దేవతలకు తద్దినం పెట్టినట్టు అవుతుంది.