Ocean : ఈ భూమి మీద ఎక్కువ శాతం నీళ్లే ఉంటాయి అంటే చాలామంది నమ్మరు. అవును.. ప్రస్తుతం మనం నివసిస్తున్న భూమి కంటే కూడా ఎక్కువ శాతం సముద్రాలే ఉన్నాయి ఈ ప్రపంచంలో. 70 శాతానికి పైనే ఈ భూమి సముద్రాలతోనే నిండి ఉంది. సముద్రాల అడుగున పోగా మిగిలిన భూమి మీద మనం బతుకుతున్నాం. ఒకవేళ సముద్రాలు ఏవీ లేకపోతే.. ఈ భూమి ఇంకా విస్తారంగా ఉండేది. అయితే.. సముద్రాలు ఎంత పెద్దగా ఉంటాయో అందరికీ తెలుసు. అసలు సముద్రాల లోతును తెలుసుకోవడం కూడా చాలా కష్టం. అంతే కాదు.. సముద్రాల్లో ఉన్న చాలా ప్రాంతాలను ఇప్పటి వరకు ఎవ్వరూ చూడలేదు. ఆ ప్రాంతాలకు మనిషి ఇప్పటి వరకు వెళ్లలేదు. అలాంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి.. అంటే నమ్ముతారా?
అసలు సముద్రం అడుగు భాగం ఎలా ఉంటుంది.. అక్కడ ఏముంటుందో తెలుసా? చాలామంది అక్కడ ఇసుక ఉంటుంది కదా అంటారు. అసలు సముద్రం అడుగు భాగానికి చేరుకోవడం సాధ్యం అవుతుందా? సముద్రంలో ఉన్న అన్ని ప్రాంతాలను మనం చేరుకోగలమా? అసలు అక్కడ ఎలాంటి జీవులు ఉంటాయి. ఏ జీవులు అక్కడ మనుగడ సాగిస్తాయో కూడా చాలామందికి తెలియదు. నిజానికి సముద్రంలో జీవించే కోట్లాది జీవులు అన్నీ సముద్రానికి ఉపరితలం దగ్గర్లోనే ఉంటాయి. అవి సముద్రం అడుగు భాగంలోకి వెళ్లవు. ఎందుకంటే.. సముద్రం లోపలికి వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది. మొత్తం చీకటిగా ఉంటుంది.
Ocean : అడుగు భాగానికి చేరుకోవడం సాధ్యమేనా?
నిజానికి సముద్రపు అడుగు భాగానికి చేరుకోవడం అన్ని సార్లు సాధ్యం కాదు. అది కూడా అన్ని ప్రాంతాల్లో సాధ్యం కాదు. సబ్ మెరైన్స్ ద్వారా వెళ్లొచ్చు. ఇప్పటి వరకు వెళ్లిన వాళ్లు ఉన్నారు. కానీ.. చాలా రిస్క్ చేయాలి. ఏమాత్రం తేడా జరిగినా వెళ్లిన వాళ్లు ప్రాణాలతో తిరిగి రారు. వాళ్ల బాడీలు కూడా దొరకకపోవచ్చు. అయితే.. సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే ఎవరైనా వెళ్లగలరు. కొన్ని సముద్రాల్లో లోతు ఏకంగా 10 కిలోమీటర్లకు పైనే ఉంటుంది. అంత అడుగు భాగానికి చేరుకోవడం దాదాపు అసాధ్యమనే చెప్పుకోవాలి.
అసలు సముద్రాల లోపల ఏం జరుగుతుంది.. అని తెలుసుకోవడానికి, అన్వేషించడానికి ఎన్ని పరిశోధనలు చేసినా.. మొత్తం సముద్రాలను ఇప్పటి వరకు అన్వేషించలేకపోయారు. కేవలం 10 శాతం వరకు మాత్రమే ఇప్పటివరకు సముద్రాల గురించి తెలుసుకోగలిగారు. మిగితా 90 శాతం సముద్రాల లోపల ఏం జరుగుతోందో తెలియదు. ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. వాటి రహస్యాల ఛేదనకు కృషి చేస్తున్నారు.