Engine Oil : మీకు బైక్ ఉందా? అయితే ఇంజిన్ ఆయిల్ ను అప్పుడప్పుడు మార్పిస్తున్నారా? చాలామందికి సర్వీసింగ్ చేయించడం చాలా తలనొప్పి. ఎందుకంటే రెండు మూడు నెలలకు ఒకసారి ఆయిల్ చేంజ్ చేయడం, సర్వీసింగ్ అంటే తడిసి మోపెడు అవుతుంది. కానీ.. తప్పదు. ఎప్పటికప్పుడు బైక్ ఇంజిన్ ఆయిల్ ను మార్చాల్సిందే. కానీ.. ఎప్పుడు మార్చాలి అనేదానిపై చాలామందికి అవగాహన ఉండదు. అటువంటి వాళ్ల కోసమే ఈ కథనం.
ఇంజిన్ అనేది బైక్ కి చాలా కీలకం. ఇంజిన్ కు ఇంజిన్ ఆయిల్ అనేది చాలా ముఖ్యం. ఇంజిన్ ఆయిల్ లేకపోతే బైక్ సరిగ్గా నడవదు. అందుకే ఇంజిన్ ఆయిల్ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. ఇంజిన్ ఆయిల్ ను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. ఇంజిన్ లో సౌండ్ పెరిగితే వెంటనే ఇంజిన్ ఆయిల్ మార్చుకోవాలి. మామూలుగా వచ్చే సౌండ్ కంటే ఎక్కువ సౌండ్ వస్తే.. మోటర్ సైకిల్ ఇంజిన్ ఆయిల్ మార్చాలని తెలుసుకోవాలి.
Engine Oil : ఆయిల్ రంగు చూసి కూడా చెప్పొచ్చు
ఇంజిన్ ఆయిల్ ఫ్రెష్ గా ఉన్నప్పుడు లైట్ కలర్ బ్రౌన్ లో ఉంటుంది. ఆ తర్వాత అది నల్లగా మారిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇంజిన్ ఆయిల్ నల్లగా మారుతుందో.. అప్పుడు అది ఇక పనికిరాదు. వెంటనే ఆయిల్ మార్చాలి. లేకపోతే ఇంజిన్ పాడయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంజిన్ ఆయిల్ లేవల్ ను కూడా చేసుకుంటూ ఉండాలి. ఇంజిన్ ఆయిల్ లేవల్ తగ్గితే వెంటనే ఇంజిన్ ఆయిల్ మార్చాలి. ప్రస్తుతం ఉన్న బైక్స్ బీఎస్ 6 వాహనాలు. ఇవి సెన్సార్ ఆధారంగా పని చేస్తాయి. ఈ బైక్స్ కు ఇంజిన్ ఆయిల్ ఎప్పుడు మార్చుకోవాలో బైక్ మీద ఇండికేటర్ ఉంటుంది. ఈ ఇండికేటర్ సింబల్ ద్వారా ఇంజిన్ ఆయిల్ ను మార్చుకోవచ్చు.