Why We See Indian Roller Bird On Vijayadashami : విజయదశమి అంటేనే విజయాన్ని పండుగలా జరుపుకునే పండుగ. విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడమే విజయదశమి. దీన్నే దసరా అని కూడా అంటారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యావత్ దేశమంతా దసరా పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఎక్కడ చూసి సందడే నెలకుంటుంది. ఎక్కడెక్కడో ఉన్నవాళ్లు సొంతూరు వచ్చి తమ ఫ్యామిలీతో చాలా సంతోషంగా ఒక్కరోజు గడుపుతారు. ఆనందంతో ఉంటారు. పిండి వంటలు చేసుకొని తింటారు. పల్లెల్లో విజయదశమి నాడు చాలా రకాల పూజలు చేస్తుంటారు. కొన్ని ఆచారాలు కూడా ఉంటాయి. దసరా రోజున జమ్మి చెట్టుకు పూజలు చేయడం.. అలాగే.. జమ్మి ఆకులను తమతో పాటు తెచ్చుకొని పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం చేస్తుంటారు.
ఇదంతా పక్కన పెడితే దసరా నాడు ఖచ్చితంగా అందరూ చేసే పని పాలపిట్టను చూడటం. పాలపిట్ట తెలుసు కదా.. రంగు రంగుల్లో ఉంటుంది. ఆ పక్షిని దసరా రోజు ఖచ్చితంగా చూడాలి. చూస్తారు కూడా. గ్రామస్తులంతా అడవుల్లోకి వెళ్లి పాలపిట్టను చూసి వస్తారు. అసలు పాలపిట్టను ఎందుకు చూస్తారంటే.. పాలపిట్టను దసరా రోజు చూస్తే మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయట. సిరిసంపదలు లభిస్తాయట. ఈ ఆచారం వెనకటి నుంచి వస్తోంది. అప్పటి నుంచి ఇప్పటికీ అదే ఆచారాన్ని కొనసాగిస్తున్నారు.
Why We See Indian Roller Bird On Vijayadashami : దసరా రోజే కనిపించనున్న పాలపిట్ట
నిజానికి పాలపిట్ట మామూలు రోజుల్లో కనిపించదు. అడవుల్లో మీరు ఎంత వెతికినా ఎక్కడా కనిపించదు. కానీ.. దసరా రోజు మాత్రం ప్రజలకు ఖచ్చితంగా కనిపిస్తుంది పాలపిట్ట. అయితే.. పాలపిట్ట విషయంలో ఓ కథ కూడా ప్రాచర్యుంలో ఉంది. అప్పట్లో పాండవులు జూదంలో రాజ్యాన్ని కోల్పోతారు కదా. అప్పుడు అరణ్యవాసానికి వెళ్లి.. అది ముగిశాక.. తిరిగి వస్తుండగా వారికి పాలపిట్ట కనిపించిందట. దాన్ని చూసిన వారికి తిరిగి వచ్చాక రాజ్యం చేతుల్లోకి వచ్చింది. అప్పటి నుంచి వాళ్లకు అన్నీ శుభాలే కలిగాయి. దీంతో అప్పటి నుంచి పాలపిట్టను చూస్తే మంచి జరుగుతుంది అని నమ్ముతున్నారు. పాండవుల అరణ్యవాసం ముగిసిన రోజునే విజయదశమిగా ఇప్పటికీ జరుపుకుంటున్నాం.
ఏది ఏమైనా విజయదశమి పండుగను పిల్లా పెద్దా అనే తేడా లేకుండా.. పేదా, ధనిక అనే బేధం లేకుండా ప్రతి ఒక్కరు ఎంతో ఘనంగా తమకు ఉన్నంతలో జరుపుకుంటారు. ఒక్క రోజు ఫ్యామిలీతో సంతోషంగా ఉంటారు.