Married : ఈ మధ్యకాలంలో కొందరు తమ కామ కోరికలు తీర్చుకునేందుకుగాను ప్రేమ, పెళ్లి వంటి వాటిని ఆయుధాలుగా వాడుకుంటూ ఇతరుల జీవితాలను నాశనం చేస్తున్నారు. చివరికి తమ కోరికలు తీరిపోయిన తర్వాత ఇతరులను ఏమాత్రం పట్టించుకోకుండా రోడ్డున పడేస్తున్నారు. తాజాగా ఓ యువకుడు పెళ్లయి పిల్లలు ఉన్నటువంటి మహిళని ప్రేమ పేరుతో వంచించి చివరికి తన అవసరం తీరిపోయాక మొహం చాటేసిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే సంధ్య (పేరు మార్చాం) అనే వివాహిత తన కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక రాష్ట్రంలోని హైదరాబాద్ నగర పట్టణ పరిసర ప్రాంతంలో నివాసముంటుంది. అయితే సంధ్య కి పెళ్లయినప్పటి నుంచి తన భర్తతో సఖ్యత లేకపోవడంతో మనస్పర్ధలు, విభేదాలతో సతమతమయ్యింది. దీంతో గత కొద్ది కాలంగా తన భర్త నుంచి విడిపోయి వేరుగా ఉంటోంది. అయితే అప్పటికే వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు ఉండటంతో తన పిల్లల సంరక్షణ కూడా తాను తీసుకుంది. దీంతో కష్టపడి పని చేస్తూ తన పిల్లలని పోషిస్తుంది సంధ్య. ఈ క్రమంలో స్థానికంగా ఉన్నటువంటి ఓ యువకుడితో సంధ్య కి పరిచయం ఏర్పడింది. దీంతో తరచూ యువకుడు ఇంటివి వచ్చి వెళుతూ ఉండేవాడు. ఈ క్రమంలో ఈ పరిచయం కాస్త కొద్ది సమయంలోనే ప్రేమగా మారింది. అంతటితో ఆగకుండా గత కొద్ది నెలలుగా వీరిద్దరూ సహజీవనం కూడా చేస్తున్నారు.
కానీ ఏమైందేమోగాని సంధ్యతో సహజీవనం చేస్తున్న యువకుడు గత రెండు, మూడు వారాలుగా ఇంటికి రావడం మానేశాడు. అంతేకాకుండా సంధ్య ఫోన్ చేసి మాట్లాడాలని ప్రయత్నించినప్పటికీ ఫోన్ ఎత్తడం లేదు. దీంతో ఆరా తీసిన సంధ్య తనపై తన ప్రియుడికి మోజు తీరిపోయిందని తెలుసుకుంది. అందువలనే తన ప్రియుడు ఇంటికి రావడం మానేసాడని అలాగే తన ఫోన్ ఎత్తడం లేదని ఏకంగా తన ప్రియుడి ఇంటికి వెళ్ళింది. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో చేసేదేమీ లేక సంధ్య దగ్గర్లో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించి తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేసింది.