Actor Ravishankar:పెద్దింటి అల్లుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ నగ్మా గురించి అందరికీ తెలిసిందే. ఒకానొక సమయంలో టాలీవుడ్ బాలీవుడ్ అంటూ తేడా లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నగ్మా అప్పట్లో ఆగ్ర హీరోలు అందరి సరసన నటించారు. ఈమె డేట్స్ కోసం ఎంతోమంది అగ్ర హీరోలు సైతం ఎదురుచూసేవారు. ఇకపోతే అగ్రతారగా ఈమె ఎంత గుర్తింపు సంపాదించుకుందో ఈమె ఎఫైర్స్ గురించి కూడా పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. అప్పట్లో ఈమె క్రికెటర్ గంగోలితో ప్రేమలో ఉన్నారని వార్తలు చక్కర్లు కొట్టాయి. అదేవిధంగా భోజపురి నటుడు రవిశంకర్ తో కూడా ఈమె రిలేషన్ కొనసాగించిందని వార్తలు వచ్చాయి .
రవి శంకర్ పలు సినిమాలలో నటుడిగా ఎంతో అద్భుతమైన గుర్తింపు సంపాదించుకున్నారు.అల్లు అర్జున్ నటించిన రేసుగుర్రం సినిమాలో మద్దాలి శివారెడ్డి పాత్ర ద్వారా అందరిని ఆకట్టుకున్నారు. అయితే ఒకప్పుడు ఈయన బోజ్ పురిలో అగ్ర హీరోగా నటించారు. ఆ సమయంలోనే నటి నగ్మాతో రిలేషన్ లో ఉన్నారని వార్తలు వచ్చాయి. అయితే అప్పటికే నటుడు రవి శంకర్ కి వివాహం కూడా జరిగింది. ఇక ఈ విషయం తన భార్యకు కూడా తెలిసింది. ఇలా వీరి ప్రేమ ప్రయాణం భోజపురి ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చెక్కర్లు కొట్టింది.

Actor Ravishankar: ఒంటరి జీవితాన్ని గడుపుతున్న నగ్మా…
ఇలా పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట చివరికి విడిపోయారు. వీరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ నగ్మా భోజపురి ఇండస్ట్రీని వదిలి బయటకు వచ్చారు.ఈ విధంగా హీరో రవిశంకర్ తో బ్రేకప్ చెప్పుకున్న అనంతరం ఈమెకు ఇండస్ట్రీలో ఉన్న పాపులారిటీని బేస్ చేసుకుని రాజకీయాలలోకి అడుగు పెట్టారు. రాజకీయాలలో కూడా పెద్దగా రాణించలేకపోయారు. ఇలా నగ్మా పలువురు స్టార్ సెలబ్రిటీలతో ప్రేమ ప్రయాణం నడిపి చివరికి పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయారు.ఇలా ఒకప్పుడు అగ్రతారగా ఓ వెలుగు వెలిగిన ఈమె ప్రస్తుతం ఐదు పదుల వయసులో ఉన్నప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా జీవితాన్ని గడుపుతున్నారు.