Actress Kamya Punjabi: పానీ పూరి అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి ముఖ్యంగా అమ్మాయిలు పానీపూరి అంటే ఈ లోకం మర్చిపోయి పానీపూరీలు తింటూ ఆ రుచిని ఆస్వాదిస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు. ఈ విధంగా పానీ పూరిలను ఇష్టపడటంలో సెలబ్రిటీలు కూడా ఏమాత్రం తీసిపోరని చెప్పాలి. ఇలా పానీపూరీలు తింటూ ఈ పానీపూరీల మైకంలో ఏకంగా లక్ష రూపాయలను నటి అక్కడే మర్చిపోయిన ఘటన చోటుచేసుకుంది. ఇంతకీ లక్ష రూపాయలను మర్చిపోయిన ఆ నటి ఎవరు అంటేకోయి మిల్ గయా, కహో నా ప్యార్ హై వంటి తదితర హిట్ సినిమాల్లో నటించిన కామ్య పంజాబీ.
ఇటీవల కాలంలో ఇండోర్ వెళ్లిన ఈ నటి అక్కడ ఒక ఈవెంట్ లో పాల్గొంది. ఈ క్రమంలోనే తనకు పానీ పూరి తినాలనిపించడంతో బయటకు వెళ్లి పానీపూరిలను తింటున్న క్రమంలో తన చేతిలో ఒక ఎన్వలప్ కవర్ లో లక్ష రూపాయలు డబ్బు పెట్టి ఆ కవర్ ను టేబుల్ పై పెట్టారు. ఇలా పానీపూరీలు తింటూ ఫోటోలకు ఫోజులు ఇస్తూ చివరికి లక్ష రూపాయల డబ్బులను అక్కడే మరిచి తిరిగి హోటల్ వెళ్లారు.హోటల్ కి వెళ్ళిన కాసేపటికి ఆమె లక్ష రూపాయలు అక్కడే పెట్టిన విషయం గుర్తుకు వచ్చింది.
Actress Kamya Punjabi: ఆశ్చర్యం వేసింది..
ఈ విషయం గుర్తుకు రాగానే వెంటనే తన మేనేజర్ ని పంపించి డబ్బు తీసుకురావాలని సూచించింది. అయితే మేనేజర్ అక్కడికి వెళ్లి డబ్బు ఉన్నటువంటి ఎన్వలప్ కవర్ తిరిగి తీసుకు వచ్చారు.ఇక ఈ విషయాన్ని ఈమె సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యానని, అయితే ఆ డబ్బు తిరిగి వస్తుందని నమ్మకం తనకు లేదని తెలియజేశారు. తాను వెళ్లిన చోట ఎంతో రద్దీగా వుందని,అలాంటి రద్దీ ఉన్నచోట డబ్బు ఉన్నటువంటి తన ఎన్వలప్ తిరిగి తనకు దొరకడం తనకు ఆశ్చర్యం కలిగిస్తుందని ఈమె తెలియజేశారు. ఇండోర్ ప్రజలు చాలా మంచివారు దయగల వారంటూ ఈ సందర్భంగా తాను డబ్బు మర్చిపోయిన సంఘటనను అభిమానులతో పంచుకున్నారు.