Actress Neha Shetty ఆకాశ్ పూరీ హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన మెహబూబా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ ” నేహా శెట్టి “. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. కానీ ఈ ముద్దుగుమ్మ నటనకు మాత్రం టాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత యంగ్ హీరో సందీప్ కిషన్ హీరో గా నటించిన గల్లీ రౌడీ లాంటి సినిమాలు చేసింది. ఈ మూవీతో ప్రేక్షకులకు మరింత చేరువైంది ఈ భామ. తాజాగా యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డతో కలిసి ” డీజే టిల్లు ” అనే సినిమాలో నటిస్తుంది. ఈ చిత్రానికి విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
కాగా ఇటీవలే ఈ మూవీ ఈవెంట్ లో ఓ రిపోర్టర్ ఈమె గురించి ఒక అసభ్య ప్రశ్న అడిగాడు. ఇందుకు బదులుగా తనదైన శైలిలో గట్టి కౌంటర్ ఇచ్చింది ఈ భామ. ఈ ఘటనలో నేహా శెట్టి కి నెటిజన్లు అంతా మద్దతుగా నిలిచారు. సోషల్ మీడియాలోను యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన డైన శైలిలో ఫాలోయింగ్ ని పెంచుకునే పనిలో పడింది. తన హాట్ పోటోలతో యూత్ లో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటుంది ఈ భామ. ఆ ఫోటోలను మీరు ఓ లుక్కేయండి.