Actress Nidhi Agerwal అందాల ఆరబోతలో నా స్టైలే వేరు అంటున్న ” నిధి అగర్వాల్ “….

Jaya Kumar

Actress Nidhi Agerwal అక్కినేని నాగ చైతన్య నటించిన సవ్యసాచి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది ” నిధి అగర్వాల్ “. ఆ తర్వాత అఖిల్ హీరోగా వచ్చిన మిస్టర్ మజ్నులో కూడా నటించింది నిధి. ఈ చిత్రం కూడా అంచనాలు అందుకోలేకపోయింది. తెలుగు ఇండస్ట్రీ ఈమెకు కలిసిరాలేదు అనుకుంటున్న తరుణంలో.. ఇస్మార్ట్ శంకర్ కలిసొచ్చింది. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో రామ్ హీరోగా నటించాడు. ఇది బ్లాక్‌బస్టర్ కావడంతో అమ్మడి దశ మారిపోయింది. ప్రస్తుతం వరస సినిమాలు చేస్తుంది నిధి. ముఖ్యంగా తమిళ్‌లో ఈమెకు అదిరిపోయే క్రేజ్ ఉంది. అక్కడ ఏకంగా నిధి అగర్వాల్‌కు గుడి కూడా కట్టారు అభిమానులు.

తాజాగా మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా నటించిన హీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది నిధి అగర్వాల్. ఈ సినిమాకు ముందు 50 నుంచి 80 లక్షల మద్య పారితోషికం తీసుకున్న ఈ అమ్మడు.. హీరో సినిమాకు మాత్రం ఏకంగా 2 కోట్ల వరకు అందుకున్నట్లు తెలుస్తుంది. కొత్త హీరో.. అందులోనూ హాట్ అందాల ఆరబోత చేయాలి కాబట్టి ఈ సినిమాకు భారీగా పారితోషికం అందుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో నటిస్తుంది నిధి. తెలుగులో మరిన్ని అవకాశాలు కూడా నిధి ముందుకు వస్తున్నాయి. ప్రతీ సినిమాకు కూడా కోటికి పైగానే డిమాండ్ చేస్తుంది నిధి. ప్రస్తుతం ఈమె తమిళ హీరో శింబుతో ప్రేమలో ఉందనే వార్తలు వస్తున్నాయి. ఓ వైపు సినిమాలు.. మరోవైపు హాట్ ఫోటోషూట్స్‌తో నిధి ఫుల్ జోష్ లో దూసుకుపోతుంది. సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గా ఉండే ఈ భామ తన భారీ అందాలను ఆరబోస్తూ కుర్రకారును ఫిదా చేస్తుంది. ఈ మేరకు నిధి అగర్వాల్ హాట్ ఫోటోస్ కొన్ని మీకోసం…

- Advertisement -