Actress Ramaprabha: నటి రమాప్రభ ఈ పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. ఈమె కొన్ని దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతూ అగ్రనటిగా గుర్తింపు పొందారు. ఎన్టీఆర్ ఏఎన్నార్ కాలం నుంచి నేటి యువ హీరోల సినిమాలలో కూడా ఈమె నటిస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు. ప్రస్తుతం వయసు పైబడటంతో ఈమె సినిమాలకు విరామం ఇచ్చి తన సొంత నివాస గ్రామమైన మదనపల్లిలో నివసిస్తున్నట్లు తెలుస్తోంది.ఇలా నటిగా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేసిన రమాప్రభ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన కెరీర్ గురించి పలు విషయాలను తెలియజేశారు.తను ఎన్నో బాషలలో నటించినప్పటికీ తనకు తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను తెచ్చిపెట్టిందని రమాప్రభ వెల్లడించారు.ఇకపోతే ఈమె నటుడు శరత్ కుమార్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఇద్దరు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుని వెళ్ళిపోయారు. ఇక రమాప్రభకి పిల్లలు లేక పోవడంతో ఈమె ఏడాది వయసున్న తన అక్క కూతురు విజయ చాముండేశ్వరి దత్తత తీసుకొని పెంచారు.

Actress Ramaprabha: నేను చనిపోయినా కూడా ఆ విషయాన్ని మా అసోసియేషన్ కి చెప్పొద్దు..
ఇలా ఈమెను పెంచిపెద్ద చేస్తే టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హాస్యనటుడిగా కొనసాగుతున్నటువంటి నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారికి ఇచ్చి పెళ్లి చేశారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఇలా రాజేంద్ర ప్రసాద్ తనకు అల్లుడు అయ్యారు.ఇకపోతే ఈ ఇంటర్వ్యూ సందర్భంగా మా అసోసియేషన్ గురించి మాట్లాడుతూ తనకు మా అసోసియేషన్ ఎప్పుడూ కూడా ఏమాత్రం గౌరవం ఇవ్వలేదని తనని మా ఎంతో అవమానపరిచిందని రమాప్రభ గారు.ఒకవేళ తాను చనిపోతే ఆ విషయాన్ని మా అసోసియేషన్ కి కూడా తెలియ చేయకూడదని కోరారు.