actress trisha to marry tamil director
actress trisha to marry tamil director

Trisha : మూడు పదుల వయసు దాటినా.. ఏమాత్రం అందం తగ్గలేదు త్రిషకు. ఇంకా కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తూ సినిమాల్లో నటిస్తూ తన సత్తా చాటుతోంది త్రిష. ఇండస్ట్రీలో కాస్త వయసు పెరిగిందంటే చాలు.. చాలామంది అడిగే మొదటి ప్రశ్న.. పెళ్లెప్పుడు అని. త్రిష పెళ్లి గురించి కూడా సోషల్ మీడియాలో బాగానే చర్చ నడుస్తోంది. ఇప్పుడు కాదు.. దాదాపు ఐదారేళ్ల నుంచి త్రిష పెళ్లి గురించి వార్తలు వస్తున్నాయి. కానీ.. అవేవి నిజం కాలేదు.

actress trisha to marry tamil director
actress trisha to marry tamil director

తెలుగు ఇండస్ట్రీలో దశాబ్దం పాటు ఓ వెలుగు వెలిగి.. అందరు స్టార్ హీరోలతో నటించి మెప్పించింది త్రిష. ప్రస్తుతం త్రిష ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై దృష్టి పెట్టింది. అయితే.. ఇప్పటికీ తన క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు. తన అందం ఇంకా రెట్టింపు అయింది.

Trisha : 2015 లో ఎంగేజ్ మెంట్ వరకు వెళ్లి ఆగిపోయిన త్రిష పెళ్లి

2015 లో త్రిష పెళ్లి గురించే హాట్ టాపిక్. వరుణ్ మానియన్ అనే బిజినెస్ మెన్ ను త్రిష పెళ్లి చేసుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. త్రిష కూడా అఫిషియల్ గా ప్రకటించింది. వాళ్ల ఎంగేజ్ మెంట్ కూడా అయిన తర్వాత త్రిష తన పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నట్టు ప్రకటించింది. ఆ తర్వాత కూడా తన పెళ్లి గురించి చాలా వార్తలు వచ్చాయి కానీ.. ఏవీ నిజం కాలేదు.

actress trisha to marry tamil director
actress trisha to marry tamil director

తాజాగా మరోసారి త్రిష పెళ్లి గురించి వార్తలు వస్తున్నాయి. త్రిష.. తమిళ డైరెక్టర్ ను పెళ్లి చేసుకోబోతోందట. ఆ తమిళ డైరెక్టర్ ఎవరు అనేది మాత్రం ఎవ్వరికీ తెలియదు కానీ.. ఆయన మాత్రం ప్రస్తుతం ఫామ్ లో ఉన్న డైరెక్టర్ అట. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన ఆ తమిళ దర్శకుడితో త్వరలోనే త్రిష పెళ్లి జరగబోతోందని వార్తలు షికారు చేస్తున్నాయి. మరి.. ఈ వార్త అయినా నిజమేనా? అంటే మాత్రం ఖచ్చితంగా చెప్పలేం. కానీ.. త్వరలోనే త్రిష.. తన పెళ్లి గురించి అఫిషియల్ ప్రకటన చేయనుందని సమాచారం.

ఇక.. త్రిష సినిమాల విషయానికి వస్తే.. త్రిష ప్రస్తుతం తమిళ సినిమాలు పొన్నాయ్ సెల్వన్, సతురంగ వెట్టాయ్ అనే రెండు సినిమాల్లో నటిస్తోంది. వెబ్ సిరీస్ లపై కూడా త్రిష ఇంట్రెస్ట్ చూపిస్తోంది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూలై 23, 2021 at 7:41 సా.