Actress Vijaya Shanti ఆ అగ్ర హీరోలతో గొడవల గురించి క్లారిటి ఇచ్చిన… విజయశాంతి

Jaya Kumar

Actress Vijaya Shanti తెలుగు చిత్ర పరిశ్రమలో లేడీ అమితాబ్ గా పేరు సంపాదించి… తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు విజయ శాంతి. స్టార్ హీరోలకు ధీటుగా లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించి శభాష్ అనిపించుకున్నారు విజయశాంతి. టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ లతో కలిసి ఎన్నో సినిమాలు చేసారు. అలాంటి విజయ శాంతి ఆ అగ్ర హీరోలతో నటించడం ఆపేయడం వెనుక ఏమైనా కారణాలు ఉన్నాయా అని అందరికీ అనుమానాలు వచ్చిన మాట వాస్తవమే. అయితే ఇప్పుడు ఆ విషయాలపై పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు విజయశాంతి. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ గొడవలపై ఒక క్లారిటి ఇచ్చారు.

ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ క్రేజీ ఆన్ స్క్రీన్ హీరో హీరోయిన్స్‌లో బాలకృష్ణ – విజయశాంతి, చిరంజీవి – విజయ శాంతి ముందు వరుసలో ఉంటారు. బాలయ్యతో దాదాపు 17 సినిమాల్లో కలిసి నటించారు. విజయశాంతికి మరే తెలుగు హీరోతో లేనంత సక్సెస్ రేట్ బాలయ్యతో ఉందంటే అతిశయోక్తి కాదు. అలాగే చిరంజీవితో కూడా చాలా సినిమాలు చేసింది విజయశాంతి… వీరి కాంబో లో కూడా ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి. విజయ శాంతి , చిరు ల మధ్య రాజకీయాల పరంగా గ్యాప్ వచ్చినందని అందరికీ తెలిసిందే. ఈ మేరకు సరిలేరు నీకేవ్వరు ప్రీ రిలీజ్ వేడుకలో వీరిద్దరి గొడవల గురించి చెప్తూ అభిమానులకు ఇకపై గొడవలు లేవు అంటూ క్లారిటి ఇచ్చేశారు.

అయితే ఇప్పుడు తాజాగా ఈ ఇంటర్వ్యూ లో బాలయ్యతో తన అనుబంధం గురించి మాట్లాడింది. 1980 సంవత్సరంలో మొదలైన ఈ కాంబినేషన్… ఆ తరువాత దాదాపు 13 ఏళ్ల పాటు కొనసాగింది. ఈ సమయంలో వీరిద్దరి కాంబినేషన్ లోనే 17 సినిమాలకు పైగా నటించారు. దర్శక నిర్మాతలకు కూడా బాలయ్య, విజయశాంతి జోడి అంటే హిట్ పెయిర్ గా భావించేవాళ్లు. ఇక ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చివరి సినిమా నిప్పురవ్వ. ఈ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి నటించడం మానేశారు. అయితే నిప్పు రవ్వ సినిమా సమయంలో బాలకృష్ణ, విజయశాంతి మధ్య తీవ్రమైన విభేదాలు వచ్చాయని… అందుకే వీరిద్దరూ కలిసి నటించడం లేదని బాగా పుకార్లు వచ్చాయి.

అందులో ఎలాంటి నిజం లేదు అని చెప్పింది విజయ శాంతి. నిప్పు రవ్వ సినిమా తర్వాత తన రెమ్యునరేషన్ పెరగడం వల్ల… బడ్జెట్ సమస్యలు వస్తున్నాయని అసలు విషయం బయట పెట్టింది. ఆ కారణం గానే నిప్పురవ్వ సినిమా తర్వాత తాను ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేశానని చెప్పారు. ఈ ఒక్క కారణంతోనే బాలయ్య, చిరంజీవితో సినిమాలు చేయలేదని… తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చింది విజయశాంతి.

- Advertisement -