Afghan woman: అఫ్గానిస్తాన్ లో తాలిబన్ల ప్రభుత్వం ప్రజల హక్కుల్ని కాలరాస్తుంది. వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటోంది. మహిళల విషయంలో తాలిబన్లు వివక్షను ప్రదర్శిస్తున్నారు. తాజాగా యూనివర్సిటీల్లో మహిళలను ఎంట్రీని నిషేధిస్తూ తాలిబన్లు నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయంగా ఎన్నో అభ్యంతరాలు వస్తున్నా.. తాలిబన్లు వాటిని ఏం పట్టించుకోలేదు. మహిళలకు యూనివర్సిటిల్లో ప్రవేశాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది.
తాలిబన్ల నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మహిళలు యూనివర్సిటీల దగ్గర పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్నారు. దీంతో మహిళలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. యూనివర్సిటీల దగ్గర ప్రత్యేక బలగాలను తాలిబన్లు రంగంలోకి దిగారు. వారి ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచివేస్తున్నారు. మార్వా అనే యువతి యనివర్సిటికీ వెళ్లడానికి కొద్దిరోజుల మాత్రమే సమయం ఉంది. కానీ ఇప్పుడు సోదరుడు ఒక్కడే వెళుతున్నాడని తెలిసి మార్వా తీవ్ర ఆవేదనకు గురైంది.
మహిళలపై యూనివర్సిటీల్లో నిషేధం విధించడం తల నరకడం కన్నా బాధాకరమని మార్వా చెబుతోంది. మార్వా మాట్లాడుతూ.. తమను పశువుల కంటే హీనంగా చూస్తున్నారని, ఇంట్లో నుంచి బాలికలు బయట అడ్డుపెట్టడానికి కూడా హక్కు లేదన్నారు. పశువులు కూడా ఎక్కడికైనా వెల్లగలవని. కానీ తమపై ఆంక్షలు విధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.తాము పుట్టి ఉండకపోతేనే బాగుండేదని, భూమిపై పుట్టినందుకు బాధపడుతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశారు మార్వా.
Afghan woman:
కాబూల్‌లోని ఓ మెడికల్ యూనివర్సిటీలో ఇటీవల ఎంట్రన్స్ టెస్ట్ కోసం మార్వా పరీక్ష రాసింది. తన సోదరుడు హహిద్ తో కలిసి యూనివర్సిటీలో అడుగు పెట్టాలని భావించింది. కానీ మహిళలకు యూనివర్సిటీల్లో నిషేధం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే.. మార్వా ఆశలు అడియాశలయ్యాయి.అయితే 2021 సెప్టెంబర్ నుంచి సెకండరీ స్కూల్స్ లలో అబ్బాయిలకే ప్రవేశం కల్పిస్తున్నారు. దీంతో బాలిక డ్రాపవుట్ 45 శాతంగా నమోదైంది. మహిళలకు యూనివర్సిటీల్లో నిషధం విధండచంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.