Akira Nandan: గత కొన్నేళ్ళుగా మెగా ఫ్యామిలీలో అందరూ, మెగా ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచుస్తుంది పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్ దంపతుల కొడుకు అకీరా నందన్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ గురించే. మెగా హీరోలలో టాలెస్ట్ హీరోగా క్రేజ్ తెచ్చుకుంటాడని మెగాస్టార్ కూడా అకీరా హైట్ గురించి కామెంట్ చేసి మురిసిపోయారు. అంతేకాదు, అకీరా ఎంట్రీ బాధ్యతలు చిరు తీసుకున్నట్టు టాక్ వినిపించిది. పవన్ కళ్యాణ్ సొంత బ్యానర్‌లోనే అకీరా మొదటి సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
అయితే, ఇటీవల అకీరా గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా చాలా ఏళ్ళ తర్వాత పవన్ – రేణూ కలవడం..తన పిల్లలు అకీరా నందన్, ఆధ్యలతో పవన్ కలిసి గడపడటం సోషల్ మీడియాలో రక రకాల చర్చలు తెరతీసింది. ముందు వైజాగ్ అమ్మాయిని పెళ్లి చేసుకున్న పవన్, తనతో విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత బద్రి సినిమా సమయంలో పవన్ రేణూల మధ్య ప్రేమ, సహజీవనం తర్వాత పెళ్లిచేసున్నారు. అకీరా, ఆధ్యలకు పవన్ తండ్రైయ్యాడు. అయితే, పవన్ ప్రజారాజ్యం పార్టీ సమయంలో జనాల కోసం ఎక్కువ సమయం కేటాయిచాల్సి రావడం కుటుంబ బాధ్యతలను ఎక్కువగా తీసుకోలేననే భావన వల్ల రేణూకి చట్టపరంగా విడాకులిచ్చాడు.
Akira Nandan
అయినా, ఇంతకాలం పవన్ పిల్లల విషయంలో ఏ లోటూ చేయడం లేదు. రేణూ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా పిల్లల కోసం వెళ్ళి వస్తుంటారని, అలాగే..ఇక్కడ మెగా ఫ్యామిలీలో జరిగే ప్రతీ వేడుకకు అకీరా, ఆధ్యలు రావడం తెలిసిందే. అయితే, ఇన్నాళ్ళు అకీరా మెగా వారసుడని కొణిదెల కుటుంబానికి చెందినవాడని చెప్పుకున్నారు. కానీ, ఇటీవల జరిగిన గ్రాడ్యుయేషన్ డేలో మాత్రం అకీరా నందన్ దేశాయ్ అంటూ స్క్రీన్ మీద కనిపించి షాకిచ్చింది. దాంతో అకీరా కొణిదెల ఫ్యామిలీ పేరును కాకుండా తన తల్లిపేరుతోనే ఉండడానికి ఇష్టపడుతున్నట్టు టాక్ మొదలైంది. అయితే, ఇది నిజమా కాదా అనేది మాత్రం క్లారిటీ ఎటువైపు నుంచీ లేదు.