Nagarjuna: తెలుగు చిత్రసీమకు కింగ్ నాగార్జున గురించి పెద్దగా పరిచయం అక్కరలేదు. విక్రం సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ హీరోగా పరిచయమైన నాగార్జున ఆతర్వాత 80కి పైగా సినిమాల్లో నటించి దాదాపు రెండు దశాబ్దాల ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఆకట్టుకున్నాడు. ఇక తన ప్రత్యేక మేనరిజంతో ఎంతో మంది అభిమానులను తన సొంతం చేసుకున్నాడు.
దాదాపు ఆరు పదుల వయస్సు వచ్చేటప్పటికీ.. ఇప్పటికీ చెక్కుచెదరని అందం నాగార్జునకు సొంతం. ప్రస్తుతం యువ హీరోలతో సమానంగా సినీ అవకాశాలు పొందుతున్నాడు. మొత్తానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున అగ్ర స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఇక నాగార్జున తండ్రి అక్కినేని నాగేశ్వరరావు నిర్మించినటువంటి అన్నపూర్ణ స్టూడియో గురించి మనందరికీ తెలిసిందే.
ఆ తర్వాత బాధ్యతలు నాగార్జున చేపట్టి.. అన్నపూర్ణ స్టూడియోస్ ని చాలా వరకు డబ్బులు అప్పు చేశాడు. ఇక ఇదంతా పక్కన పెడితే అంత డబ్బు ఖర్చు పెట్టి స్టూడియో ని డెవలప్ చేసిన నాగార్జునకి ఒక కొత్త సమస్య వచ్చి పడిందట. ఇంతకీ అదేమిటంటే? నాగార్జున తన సొంత డబ్బుతో డెవలప్ చేసిన స్టూడియో ను సగ భాగం వాటాగా తన పెద్ద అన్నయ్య వెంకట్ అడుగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇతర ఆస్తుల్లో కూడా సగ భాగం అడుగుతున్నట్లు తెలుస్తుంది.
Nagarjuna: నాగార్జున తన అన్నయ్య కు ఈ విధంగా అడ్డం తిరిగాడు!
అంతేకాకుండా నాగార్జున సొంతంగా సంపాదించుకున్న ఆస్తుల్లో కూడా తనకు వాటా కల్పించాలని వెంకట్ కోరుతున్నట్లు తెలుస్తోంది. ఇక తను సొంతంగా సంపాదించుకున్న ఆస్తులను నీకు ఎలా ఇస్తానని నాగార్జున అడ్డం తిరిగాడట. దాంతో నాగార్జున అన్నయ్య వెంకట్ పోలీస్ కేసు పెట్టడానికి సిద్ధమైనట్లు కొన్ని వార్తల ద్వారా తెలుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన మ్యాటర్ యూట్యూబ్ లో హడావిడి గా మారింది. మీరు కూడా వీడియో వైపు ఒక లుక్కెయండి. ఇక ఈ వార్తలు గురించి నాగార్జున అధికారికంగా ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.