Akkineni Naga Chaitanya నా బెస్ట్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ” సామ్ ” తోనే అంటున్న నాగ చైతన్య… ఇంకా ఏమన్నాడంటే ?

Jaya Kumar

Akkineni Naga Chaitanya అక్కినేని నట వారసుడు నాగచైతన్య తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకొని టాలీవుడ్‌ లో దూసుకుపోతున్నారు. పేరుకు సినిమా బ్యాగ్రౌండ్‌ నుంచి వచ్చినా తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. తాత ఏఎన్నార్, తండ్రి నాగార్జునల పేరును కాపాడుతూ తండ్రికి తగ్గ తఃనాయుడు అనిపించుకుంటున్నాడు. కాగా ఏమాయ చేసావే సినిమాలో సమంత, చైతన్య కలిసి నటించిన సంగతి తెలిసిందే. 2017లో వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. అక్కినేని నాగచైతన్య తన మాజీ భార్య స్టార్ హీరోయిన్ సమంతపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. పెళ్లైన నాలుగేళ్ల తరువాత ఈ జంట విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించింది. ఈ విషయంపై సమంత పలు ఇంటర్వ్యూలలో మాట్లాడినప్పటికీ చైతు మాత్రం ఎప్పుడూ స్పందించలేదు.

రీసెంట్ గా ‘బంగార్రాజు’ సినిమా ప్రమోషన్స్ లో తొలిసారి తన విడాకుల గురించి మాట్లాడారు నాగచైతన్య. ఇద్దరి సంతోషం కోసం తీసుకున్న నిర్ణయమని… ఇప్పుడు తను హ్యాపీ, నేను హ్యాపీ అంటూ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా… ప్రస్తుతం చైతు లాల్ సింగ్ చద్దా చిత్రంతో బాలీవుడ్ డెబ్యూ ఇస్తున్న సంగతి తెలిసిందే. అమీర్ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ జంటగా నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ కి హాజరు అయిన చైతూకి ” మీ ఉత్తమ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎవరు..? అని ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులుగా వెంటనే సమంత పేరు చెప్పారు చైతూ. ప్రస్తుతం నాగ చైతన్య చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తొలిసారి ‘ఏ మాయ చేసావే’ అనే సినిమాలో నటించగా ఆటోనగర్ సూర్య, మనం, మజిలీ వంటి సినిమాల్లో కలిసి నటించి మెప్పించారు. అలానే అలియా భట్, దీపికా పదుకోనే లాంటి బాలీవుడ్ హీరోయిన్లతో కలిసి నటించాలనుందని చై తన మనసులోని మాటను బయటపెట్టాడు. అలియా, దీపికాల పెర్ఫార్మన్స్ తనకు బాగా నచ్చుతుందని… అలాంటి వారితో కలిసి నటించే ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నానని అన్నారు. సంక్రాంతి కానుకగా చైతు నటించిన ‘బంగార్రాజు’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతూ కలెక్షన్స్ పరంగా అదరగొడుతుంది.

- Advertisement -