Sumanth: టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి వారిలో నటుడు సుమంత్ ఒకరు అక్కినేని నాగార్జున మేనల్లుడు ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి ఈయన కెరియర్ మొదట్లో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి స్టార్ హీరోగా సక్సెస్ అందుకున్నారు. ఇక సుమంత్ 2004వ సంవత్సరంలో నటి కీర్తి రెడ్డిని ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.. ఈ విధంగా ప్రేమించే పెళ్లి చేసుకున్నటువంటి ఈ జంట రెండు సంవత్సరాల పాటు వారి వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే వీరిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు రావడంతో విడాకులు తీసుకున్నారు.
ఈ విధంగా కీర్తి రెడ్డి సుమంత్ విడాకులు తీసుకుని విడిపోవడంతో సుమంత్ పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారని తద్వారా కెరియర్ పై ఫోకస్ చేయకపోవడంతోనే ఈయనకు సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయి ఇండస్ట్రీకి దూరమయ్యారని తెలుస్తోంది. అయితే కీర్తి రెడ్డి మాత్రం ఒంటరిగా మిగిలిపోకుండా జీవితంలో ముందుకు సాగారు. ఈమె బెంగళూరుకు చెందినటువంటి ఓ వ్యక్తిని వివాహం చేసుకొని తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభించారు పిల్లలు కూడా కలరు.
ప్రతిరోజు ఫోన్లో మాట్లాడుతాం…
ఈ విధంగా కీర్తి రెడ్డి పెళ్లి చేసుకుని పిల్లలతో ఎంతో సంతోషంగా ఉన్నప్పటికీ సుమంత్ మాత్రం అలాగే ఉండిపోయారు. ఇకపోతే ఇలా పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్నప్పటికీ వీరిద్దరి మధ్య ఒక రిలేషన్ అలాగే కొనసాగుతుందని ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సుమంత్ వెల్లడించారు మేమిద్దరం పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నప్పటికీ ఇద్దరు మధ్య మంచి స్నేహబంధం ఉందని ఇప్పటికి కీర్తి రెడ్డితో తాను ప్రతిరోజు మాట్లాడతానని ఇక కీర్తి రెడ్డి భర్త చాలా మంచివాడని తనకు బాగా తెలుసు అంటూ ఈ సందర్భంగా సుమంత్ తన మాజీ పెళ్ళాం గురించి చెప్పినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.