Akshaya Tritiya : నేడు అక్షయ తృతీయ.. ఎందుకని అక్షయ తృతీయ నాడు బంగారం కొంటారు… దానాలు చేస్తే ఈరోజు ఏమవుతుంది…!

S R

Akshaya Tritiya : వైశాఖ శుక్లపక్షం మూడో రోజున అక్షయ తృతీయ జరుపుకుంటాం. అసలు అక్షయ తృతీయ ఎలా వచ్చింది ఎందుకు ఆరోజున బంగారం కానీ స్థలాలు కాని కొనాలని అంటారు. ముహూర్తంతో, వర్జ్యం, రాహుకాలంతో సంబంధం లేకుండా ఏ శుభకార్యం అయిన అక్షయ తృతీయ నాడు చేసుకోవచ్చని పురోహితులు చెబుతారు అలాంటి శుభదినం గురించి వివరంగా తెలుసుకుందాం.

Akshaya Tritiya అక్షయ తృతీయ ఎలా వచ్చింది…..

భూలోకంలో మొదటిసారి గండకీనదిలోని సాలగ్రామాల గర్భం నుంచి వైశాఖ శుద్ద తదియనాడు బంగారం ఉద్భవించింది. అందుకే ఈరోజును అక్షయ తృతీయగా జరుపుకుంటారు. బంగారం అనేది సాధారణ లోహం కాదు అది దేవలోహం. బంగారానికి ‘హిరణ్మయి’అనే మరో పేరు కూడా ఉంది. అందుకే బంగారానికి ఆ రోజున పండగ చేస్తాము. బంగారం విష్ణు గర్భంలో ఉంటుంది అందుకే బంగారం విష్ణు సమానం. ‘హిరణ్య గర్భో భూగర్బో మాధవో మధుసూదన’ అని విష్ణు సహస్రనామం చెబుతుంది. ఈ పండుగ ముఖ్యంగా మహిళలకు చాలా ఇష్టం. ఈ రోజున సిరి సంపదలను ప్రసాదించే శ్రీ మహాలక్ష్మీ దేవిని అందరూ భక్తి శ్రద్దలతో పూజిస్తారు.

అక్షయ అంటే తరిగిపోనిది, క్షీణించనిది అందుకే ఈరోజున బంగారం కానీ ఆస్తులు కానీ కొంటే అవి పెరుగుతాయని నమ్మకం. ఈరోజున మహాలక్ష్మి దేవుని ఆరాధిస్తే సిరి సంపదలు తమ ఇంట కొలువుంటాయని భావిస్తారు. ఇక ఇప్పటి పరిస్థితులకు అన్వయించుకోవాలంటే అక్షయ తృతీయ నాడు బంగారం కొనడం సంప్రదాయం. కానీ ఇప్పుడున్న బంగారం ధరలకు కొనడం చాలా కష్టం. కానీ మగువలు కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడున్న కాలంలో బంగారం కొనడం కేవలం అలంకారానికి మాత్రమే కాదు ఆర్థిక అవసరాలకు మంచి ఇన్వెస్ట్‌మెంట్ కూడా. చాలా మంది బంగారాన్ని భవిష్యత్తు అవసరాల కోసం కొని దాచుకుంటారు.

మరీ అక్షయ తృతీయ నాడు ఏమి చేయాలి…..

ఇక అక్షయ తృతీయ రోజున కొద్దిగా జపం చేసినా, కొద్దిగా ధ్యానం చేసినా, కొద్దిగా పారాయణం చేసిన అక్షయమైనటువంటి, అనంతమైనటువంటి దివ్యమైన ఫలితాలను పొందుతారు. అక్షయ తృతీయ లక్ష్మి దేవి కి అలాగే నరసింహ స్వామికి ప్రీతికరమైన రోజు. అందుకే ఆరోజున వారికి పూజ చేస్తే ఇంటికి మంచిది. లక్ష్మి దేవికి ఆవు నెయ్యి తో ఆరు వత్తుల దీపం వెలిగించి తీపి పదార్థం చెక్కరపొంగలి వంటిది నైవేద్యం గా సమర్పించి పూజ చేయాలి. ఇక పూజ లోని అక్షింతలను తలపై చల్లుకొని “ఓం కమల వాసినేయే నమః” అనే మంత్రం 21 సార్లు చదువుకుంటూ లక్ష్మీదేవిని గులాబీలతో పూజించాలి. ఎలా చేస్తే లక్ష్మి దేవి మన ఇంట సిరి సంపదలు ఇస్తుంది.

ఇక ఈరోజున నరసింహ స్వామికి కూడా ప్రీతికరం. ఈరోజున సింహాద్రి అప్పన్న భక్తులకు నిజరూప దర్శనం ఇస్తాడు. ఇక ఈ పర్వదినాన లక్ష్మి నరసింహ స్వామికి చందనంతో పటానికి బొట్టుపెట్టిన సాయంత్రంవేళ శుభం జరుగుతుంది. అలాగే నువ్వుల నూనెను ప్రమిదలో వేసి తొమ్మిది ఒత్తులతో దీపారాధన చేసి వడపప్పు, పానకం చేసి స్వామివారికి నైవేద్యం పెట్టాలి. “ఓం నమో నరసింహాయా” అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకుంటూ స్వామి వారిని పూజించాలి. అక్షయ తృతీయ సందర్భంగా ఇలా చేస్తే లక్ష్మీదేవి, లక్ష్మీ నరసింహ స్వామి అనుగ్రహం మనకు కలుగుతుంది. ఇక దానాలు చేసిన ఈరోజు మంచి ఫలితాలను చూడవచ్చు. అక్షయ తృతీయ నాడు జాతక దోషాలు, నవగ్రహ దోషాలతో బాధపడేవారు పాదరక్షలను దానం చేస్తే అన్ని దోషాలు తొలగిపోతాయి. అలాగే ఈ రోజున మామిడి పండ్లు, పానకం, గంధం దానం చేసిన విశేషమైన ఫలితాలను పొందగలరు. బట్టలు, గుమ్మడికాయ, మజ్జిగ, గొడుగు, దానం ఇచ్చిన విశేషమైన శుభ యోగం కలుగుతుంది. ఈ అక్షయ తృతీయ నాడు ఏ మంచి పని చేసిన కలిసి వస్తుంది. ఏ దానాలు చేసిన శుభం కలుగుతుంది. కాబట్టి ఈ అక్షయ తృతీయ నాడు లక్ష్మి నరసింహ స్వామిని పూజించి కటాక్షాన్ని పొందండి.

- Advertisement -