Allu Arjun: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టైలిష్ స్టార్ గా ఉన్న ఈయన ఐకాన్ స్టార్ గా మారిపోయారు.ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అల్లుఅర్జున్ తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో స్టైలిష్ గా ఉండడం కోసం ప్రయత్నిస్తుంటారు.ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం హైదరాబాద్లో ఏకంగా రెండు ఎకరాలలో వంద కోట్లతో అల్లుఅర్జున్ ఇంద్రభవనం లాంటి ఇంటిని నిర్మించిన సంగతి మనకు తెలిసిందే. అలాగే ఎన్నో కోట్ల విలువ చేసే కార్లు కూడా తన గ్యారేజ్ లో ఉన్నాయి.
ఇక హీరోలు షూటింగ్ నిమిత్తం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్లాల్సి ఉంటుంది అయితే ఆ ప్రదేశంలో వారికి కావలసిన అన్ని సౌకర్యాలు ఉండాలనే ఉద్దేశంతో ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క హీరో కూడా వారి కంటూ ప్రత్యేకమైన కేరవాన్ ఏర్పాటు చేసుకున్నారు. అలాగే అల్లు అర్జున్ షూటింగ్ కోసం ప్రత్యేకంగా పూణే నుంచి డిజైన్ చేయించుకున్న ఫాల్కన్ కేరవాన్ ఉన్న సంగతి మనకు తెలిసిందే. అయితే తన అభిరుచులకు అనుగుణంగా ఈ కేరవాన్ సుమారు ఏడు కోట్లతో డిజైన్ చేయించుకున్న అల్లు అర్జున్ కేరవాన్ డ్రైవింగ్ కోసం తన అభిమానిగా ఉన్నటువంటి లక్ష్మన్ అనే వ్యక్తిని నియమించుకున్నారు. అయితే లక్ష్మణ్ ఇదివరకే ఇండస్ట్రీలో పలువురి దగ్గర పని చేశారు ఆయన అల్లుఅర్జున్ అభిమాని అయినప్పటికీ చివరికి ఆయన దగ్గర కేరవాన్ డ్రైవర్ గా పని చేస్తున్నారు. ఇక ఈ కేరవాన్ డ్రైవింగ్ కోసం లక్ష్మణ్ పదిహేను రోజుల పాటు పూణే వెళ్లి శిక్షణ కూడా తీసుకున్నారు. అయితే పూణే లో 15 రోజుల పాటు తన ఖర్చులను కూడా అల్లు అర్జున్ భరించారని ఇంటర్వ్యూ సందర్భంగా లక్ష్మణ్ వెల్లడించారు.
Allu Arjun: ఆ వార్తలన్నీ అవాస్తవం…
ఇక అల్లు అర్జున్ తనకు అధిక మొత్తంలో జీతం చెల్లిస్తున్నారని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ వార్తలపై డ్రైవర్ లక్ష్మణ్ స్పందిస్తూ అసలు విషయం తెలియజేశారు…ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో నాకు అధిక మొత్తంలో జీతం ఇస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని ఆయన వెల్లడించారు. కేవలం డ్రైవర్ గా పనిచేస్తున్న తనకు రెండు లక్షలకు మించి జీతం రాదని లక్ష్మణ్ వెల్లడించారు.అయితే ఆయన అల్లు అర్జున్ కు అభిమానిగా ఉండటం వల్ల అల్లు అర్జున్ దగ్గర పని చేయడం కోసమే డ్రైవర్ గా మారిపోయారని తెలిపారు. లక్ష్మణ్ అల్లు అర్జున్ కి లక్ష్మణ్ ఎంత అభిమాని అంటే ఏకంగా అల్లు అర్జున్ సిగ్నేచర్ తన మెడ పై టాటూ వేయించుకునేంత అభిమానం ఉందని చెప్పవచ్చు.