Allu Family అల్లు ఫ్యామిలీ కావాలనే మెగా ఫ్యామిలీని కాదని నందమూరి ఫ్యామిలీ కి దగ్గరవుతుందా… ఓన్ ఇమేజ్ కోసమేనా ?

Jaya Kumar

Allu Family తెలుగు చిత్ర పరిశ్రమలో గ‌త కొద్ది రోజులుగా జ‌రుగుతోన్న ప‌రిణామాలు చూస్తుంటే అల్లు కుటుంబం నందమూరి కుటుంబాల మధ్య సన్నిహిత సబంధాలు పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. అల్లు అర‌వింద్ ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో బాల‌య్య‌తో ఓ షో ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంద‌న్న ఆలోచ‌న ముందుగా బ‌న్నీకే వ‌చ్చింది. బ‌న్నీకి ఆ ఆలోచ‌న వ‌చ్చిన వెంట‌నే బాల‌య్య‌కు ఫోన్ చేయ‌డం బాల‌య్య ఒక్క నిమిషంలోనే ఓకే చెప్పేయ‌డం వెంట‌నే జ‌రిగిపోయాయి. ఈ అన్‌స్టాప‌బుల్ షోను భారీ ఎత్తున ప్లాన్ చేసి ప్రమోషన్స్ కూడా గట్టిగానే నిర్వహించారు. ఈ షో కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది.

అయితే ఇప్పుడు ఈ షో త‌ర్వాత అల్లు – నంద‌మూరి కుటుంబాల మధ్య బంధం మరింత బలపడిందని అంటున్నారు. ఇక దీంతో అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య గ్యాప్ ఏర్ప‌డిందా ? అన్న సందేహం అయితే కొంద‌రిలో వ్య‌క్త‌మైంది. ఇప్పుడు తాజాగా నంద‌మూరి బాల‌కృష్ణ బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో అఖండ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 27న శిల్పాక‌ళావేదిక‌లో జ‌ర‌గ‌నుంది. ఈ ఈవెంట్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పెషల్ గెస్ట్‌గా హాజ‌ర‌వుతున్నాడు. ఇప్పుడు ఈ వార్తతో అల్లు – మెగా కుటుంబాలు మధ్హ్య గ్యాప్ నిజంగానే ఏర్పడింది అని అందరికీ అనుమానాలు రేకెత్తుతున్నాయి.

వీరి కుటుంబాల బంధం రోజు రోజుకు స్ట్రాంగ్ అవుతూ ఉండ‌డంతో అటు నంద‌మూరి అభిమానులు, ఇటు అల్లు అభిమానుల్లో స‌రికొత్త జోష్ నెలకొంటుంది. బన్నీ కూడా ఇప్ప‌టికే మెగా కాంపౌండ్‌తో సంబంధం లేకుండా ఓన్ ఇమేజ్ కోసం తాప‌త్ర‌య ప‌డుతున్నాడు. ఈ క్ర‌మంలోనే బాల‌య్య‌తో బంధం ఏర్ప‌రుచుకున్యున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాల‌య్య సైతం అల్లు రామ‌లింగ‌య్య‌తో త‌మ ఫ్యామిలీకి ఉన్న బంధం గురించి చెప్పి అల్లు ఫ్యాన్స్‌ను ఫిదా చేశాడు. మరి అల్లు అర్జున్మెగా ఫ్యామిలి కి బైచెప్తున్నాడా అని సోషల్ మీడియా లో చర్చ నడుస్తుంది.

- Advertisement -