Naga Chaitanya: చైతూని వాళ్ల అమ్మ ఎంతో చక్కగా, పద్దతిగా పెంచింది.. నాగార్జున మొదటి భార్య గురించి రెండు భార్య కామెంట్స్!

Akashavani

Naga Chaitanya: తెలుగు ప్రేక్షకులకు అక్కినేని నాగార్జున, అతని ఫ్యామిలీ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. మొదట నాగార్జున దగ్గుబాటి లక్ష్మి ని పెళ్లి చేసుకున్నాడు. కాగా వీరి ఇద్దరి దంపతులకు హీరో నాగచైతన్య పుట్టాడు. ఇక నాగార్జున అమల కు అఖిల్ పుట్టాడు. ఇక వీరిద్దరి అన్నదమ్ముల పుట్టుక వేరే అయినప్పటికీ వీళ్ళ బాండింగ్ మాత్రం మరో లెవెల్ అని చెప్పవచ్చు.

ఇక నాగచైతన్య చెన్నైలో తన తల్లి దగ్గరే పెరిగాడు. అఖిల్ మాత్రం హైదరాబాదులో నాగార్జున అమలల దగ్గర పెరిగాడు. ఇదిలా ఉంటే తాజాగా అమల నాగచైతన్య గురించి పలు ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టింది. సెలవు ల సమయం లో నాగ చైతన్య హైదరాబాద్ కు వచ్చేవాడిని అమల చెప్పుకోచ్చింది.

అంతేకాకుండా నాగచైతన్యను తాను పెంచలేదని.. వాళ్ళ అమ్మ నే పెంచిందని తెలిపింది. అంతేకాకుండా వాళ్ళమ్మ చైతన్యను ఎంతో పద్ధతిగా పెంచిందని అమల తెలిపింది. ఇక రెండు మూడు నెలలకు ఒకసారి నాగ చైతన్య హైదరాబాద్ వచ్చేవాడిని అమల పేర్కొంది. ఇక నాగచైతన్య మాత్రం ఇంటికి వచ్చిన తర్వాత తన తండ్రితోనే ఎక్కువగా గడిపేవాడిని అమల చెప్పుకు వచ్చింది.

ఇక ఇద్దరు ముచ్చట్లు పెట్టుకునే వారని, ఇక అఖిల్ అన్న అన్న అంటూ .. నాగచైతన్య వెంట తిరిగే వాడని అమలా చెప్పుకోచ్చింది. ఇక నాగచైతన్య వెంట అఖిల్ ఒక తోకలా ఉండే వాడిని.. ఇద్దరూ కలిసి ఆడుకునేవారు అని తెలిపింది. నాగ చైతన్య ఇంటికి వచ్చినప్పుడు మాత్రం అఖిల్ కి తన అమ్మ గుర్తుండేది కాదు అని అమల సరదాగా వెల్లడించింది.

Naga Chaitanya: చైతూ తో అఖిల్ చిన్నప్పుడు ఈ విధంగా తిరిగేవాడు అట!

ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీ ఇండస్ట్రీలో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ఓ వెలుగుతున్నారు. ఇక ఇటీవల తండ్రి కొడుకులు కాంబో లో వచ్చిన బంగార్రాజు సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక కలెక్షన్లు కూడా భారీ స్థాయిలో వసూలు చేసినట్లు తెలుస్తుంది.

- Advertisement -