Prabhas New Movie : ప్రభాస్ ఇప్పుడు కేవలం తెలుగు స్టార్ హీరో మాత్రమే కాదు. ఆయన ఇంటర్నేషనల్ స్టార్. ఆయన నటించే సినిమాలన్నీ పాన్ ఇండియా లేవల్ లో మాత్రమే కాదు.. అంతర్జాతీయంగా మంచి గుర్తింపును సాధిస్తున్నాయి. దానికి ఉదాహరణే బాహుబలి సిరీస్. బాహుబలి సినిమా గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు. ప్రపంచమంతా ఆ సినిమాను చూసింది. ప్రభాస్ ను ప్రశంసించింది. అది ప్రభాస్ రేంజ్. ప్రభాస్ చేతిలో ప్రస్తుతం చాలా సినిమాలు ఉన్నాయి.

amitabh bachchan in prabhas and nag ashwin movie
amitabh bachchan in prabhas and nag ashwin movie

సాహో తర్వాత రాధేశ్యామ్ షూటింగ్ లో పాల్గొన్న ప్రభాస్.. ఆ తర్వాత నాగ్ అశ్విన్ సినిమా షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది కానీ.. డేట్స్ సర్దుబాటు కాక.. ఆదిపురుష్, సలార్ షూటింగ్ లో పాల్గొన్నారు ప్రభాస్. ఇప్పటికే ఆ సినిమాల షూటింగ్ నడుస్తోంది. ఇంతలోనే మరో సినిమా షూటింగ్ తాజాగా ప్రారంభం అయింది.

మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇవాళ స్టార్ట్ అయ్యాయి. రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి ఒక సెట్ కూడా వేశారు. పూజా కార్యక్రమాలను తాజాగా నిర్వహించి.. షూటింగ్ స్టార్ట్ చేశారు.

Prabhas New Movie : ఈ సినిమాలో కీలక పాత్ర పోషించనున్న అమితాబ్ బచ్చన్

అయితే.. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ నటించనున్నారు. ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషించనున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసమే.. అమితాబ్ బచ్చన్ తాజాగా హైదరాబాద్ చేరుకున్నారు. ఆ సినిమా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం షూటింగ్ లో అమితాబ్ తో పాటు ప్రభాస్ కూడా పాల్గొంటున్నారు. ఈ షెడ్యూల్ వచ్చే నెల 2 వ తారీఖు వరకు ఉండనుంది.

amitabh bachchan in prabhas and nag ashwin movie
amitabh bachchan in prabhas and nag ashwin movie

సినిమా షూటింగ్ మొదట్లోనే.. అమితాబ్ బచ్చన్ మీద సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా వస్తోంది. ఈ సినిమా బడ్జెట్ 500 కోట్లు. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణెను తీసుకున్నారు. సైన్స్, ఫిక్షన్ కాన్సెప్ట్ తో ఈ సినిమా రాబోతోంది. ఇంకా ఈ సినిమాకు పేరు ఖరారు చేయలేదు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూలై 24, 2021 at 12:40 సా.