Anchor Deepika Pilli ప్రస్తుతం చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతిఒక్కరూ సోషల్ మీడియాలో టైమ్ పాస్ చేస్తుంటారు. నెట్టింట్లో ఎన్నో రకాల వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి. అందులో ఎక్కువగా అమ్మాయిల డ్యాన్స్ వీడియోలే దర్శనమిస్తాయి. చాలా మంది అమ్మాయిలు టాలెంట్ కి గ్లామర్ జోడించి అందాల ఆరబోతతో ఆకట్టుకుంటున్నారు. సామాజిక మాద్యమాలు వచ్చిన తర్వాత అలాంటి వాళ్లకు వేదిక దొరికిందనే చెప్పాలి. తాజాగా ఇప్పుడు అందాల ముద్దుగుమ్మ దీపికా పిల్లి డాన్స్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆ వీడియోని మీరు కూడా ఓ లుక్కేయండి…
టిక్ టాక్ వల్ల ఎందరో పాపులర్ అయ్యారు అలాగే కొందరు ట్రోలింగ్ కి కూడా గురయ్యారు. టిక్ టాక్ వల్ల ఎంతోమంది తమ టాలెంట్ ని బయటపెట్టి సెలబ్రిటీ అయినవారు ఎందరో ఉన్నారు. అలాగే టిక్ టాక్ ద్వారా తమ ప్రతిభను వెలుగులోకి వచ్చిన కొందరు బుల్లితెరపై సందడి చేస్తుంటే… మరికొందరికేమో వెండితెరపై కూడా అవకాశాలు సంపాదిస్తున్నారు. అలాంటి వారిలో దీపిక పిల్లి కూడా ఒకరు. అప్పటివరకు టిక్ టాక్ ఫేమ్ గా మాత్రమే తెలిసిన దీపిక పిల్లి… ఢీ షో తో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైంది. ఢీ 13 సీజన్ లో టీం లీడర్ గా రష్మి తో కలిసి దీపిక ప్రేక్షకులను అలరించింది. అయితే గత సీజన్లో వర్షిణి పాపులర్ అయినంతగా దీపిక కాలేకపోయింది. హైపర్ ఆది తో వర్షిణి లవ్ ట్రాక్ వర్క్ అయినా.. కానీ ఆది దీపిక ట్రాక్ వర్కవుట్ చేద్దామని మల్లెమాల టీం ఎంతగా ప్రయత్నించినా అది కుదర్లేదు.
ఇప్పుడు స్టార్ మా లో ఓ కామెడీ ప్రోగ్రాం కి యాంకర్ గా చేస్తూ టాలెంట్ ని నిరూపించుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. అదే విధంగా సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. తన అందాల ఆరబోతలో మాత్రం తగ్గేదే లే అంటూ దూసుకుపోతుంది. లేటెస్ట్ గా ఓ హింది సాంగ్ కి అదిరిపోయే స్టెప్పులు వేసి అందరినీ ఫిదా చేస్తుంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుండగా… దీపికా ఫాన్స్ అంతా ఆ వీడియో వారి వారి స్టైల్లో కామెంట్లు చేస్తున్నారు.