anchor rashmi singing in aashadamlo athakodallu event
anchor rashmi singing in aashadamlo athakodallu event

Anchor Rashmi : యాంకర్ రష్మీ.. తెలుసు కదా. జబర్దస్త్ లోకి ఎప్పుడైతే అడుగు పెట్టిందో అప్పుడే పెద్ద స్టార్ అయిపోయింది. నిజానికి.. జబర్దస్త్ లోకి రాకముందు.. దాదాపు 10 సంవత్సరాలు.. రష్మీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉంది. చాలా సినిమాల్లో నటించింది కానీ.. తనను ఎవ్వరూ గుర్తించలేదు. ఇండస్ట్రీలో కూడా తనకు ఆఫర్లు ఎక్కువగా రాలేదు. కానీ.. ఎప్పుడైతే జబర్దస్త్ లో యాంకర్ గా తనకు అవకాశం వచ్చిందో.. అప్పుడే తన దశ తిరిగిపోయింది. తను పెద్ద సెలబ్రిటీ అయిపోయింది. తనకు ఇప్పుడు హీరోయిన్ గానూ అవకాశాలు వస్తున్నాయి. చాలా సినిమాల్లో హీరోయిన్ గా ఇప్పటికే నటించింది. టీవీ షోలలోనూ బోలెడు ఆఫర్లు.

anchor rashmi singing in aashadamlo athakodallu event
anchor rashmi singing in aashadamlo athakodallu event

అయితే.. యాంకర్ రష్మీ అనగానే మనకు గుర్తొచ్చేది.. యాంకరింగ్. తనకు తెలుగు సరిగ్గా రాకున్నా.. తెలుగు నేర్చుకొని.. తెలుగులో యాంకరింగ్ చేస్తూ.. తెలుగు యాంకర్లకే గట్టి పోటీని ఇస్తోంది. యాంకర్ రష్మీకి డ్యాన్స్ లోనూ ప్రావిణ్యం ఉంది. తను సూపర్బ్ గా డ్యాన్స్ చేస్తుంది. యాక్టింగ్ కూడా బాగానే చేస్తుంది. ఇక.. రొమాన్స్ విషయంలోనూ తను ముందే ఉంటుంది. సుడిగాలి సుధీర్ తో తనకు ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలిసిందే కదా. తాజాగా తనలో ఉన్న మరో టాలెంట్ బయటపడింది.

anchor rashmi singing in aashadamlo athakodallu event
anchor rashmi singing in aashadamlo athakodallu event

Anchor Rashmi : ఆషాడంలో అత్తాకోడళ్లు అనే షోలో పాట పాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన రష్మీ

జీ తెలుగులో ఈ ఆదివారం.. ఆషాడంలో అత్తాకోడళ్లు అనే షో ప్రసారం కానుంది. ఈ షోకు గెస్ట్ గా వెళ్లిన రష్మీ స్టేజ్ మీద తెగ హంగామా చేసింది. అందరితో కలిసి పోయి రచ్చ చేసింది. డ్యాన్స్ చేసి అదరగొట్టింది. అలాగే.. పాట కూడా పాడింది. సింగర్ కు ఏమాత్రం తీసిపోకుండా.. సూపర్ గా పాట పాడింది రష్మీ. రష్మీ పాటకు అందరూ మైమరిచిపోయారు. ఓమైగాడ్.. రష్మీలో ఇంత టాలెంట్ ఉందా? నువ్వు ఖచ్చితంగా గొప్ప సింగర్ అవుతావు.. అని ఆ ఈవెంట్ కు వెళ్లిన వాళ్లందరూ రష్మీని మెచ్చుకున్నారు. ఆ షోకు మరో గెస్ట్ గా వచ్చిన సంగీత కూడా అదే మాట చెప్పారు. వామ్మో.. రష్మీని ఏమో అనుకున్నాం కానీ.. తను మల్టీ టాలెంటెడ్. ఏమంటారు. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. మీరు కూడా చూసేయండి.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూలై 24, 2021 at 2:50 సా.