anchor ravi and anchor rashmi funny video viral
anchor ravi and anchor rashmi funny video viral

Anchor Ravi : యాంకర్ రవి తెలుసు కదా. ఆయన చాలా సరదా మనిషి. తెలుగు బుల్లితెర మీద యాంకర్ రవి ప్రస్తుతం టాప్ యాంకర్ గా ఉన్నాడు. ఆయనకు ఉన్న క్రేజే వేరు. యాంకర్ రవి ఏ షోలో ఉన్నా.. ఆ షో చాలా సరదాగా సాగిపోతుంది. రవి వేసే జోకులు అలా ఉంటాయి మరి. అందరి మీద జోకులు వేస్తుంటాడు. చాలా జోవియల్ గా ఉంటాడు రవి. అందుకే చాలా షోలలో యాంకర్ రవిని హోస్ట్ గా తీసుకుంటారు. ఆయన ఉంటే ఇక రచ్చ రంబోలానే.

anchor ravi and anchor rashmi funny video viral
anchor ravi and anchor rashmi funny video viral

యాంకర్ రవి ఇప్పటి వరకు తెలుగు బుల్లితెర మీద చాలా షోలను నిర్వహించారు. ఎక్కువగా జీ తెలుగులో రవి యాంకర్ గా వ్యవహరిస్తుంటాడు. తాజాగా జీ తెలుగులో సరికొత్త షో ఆషాడంలో అత్తా కోడళ్లును నిర్వహించారు. ఈ షో.. ఈ ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రసారం కానుంది.

Anchor Ravi : రష్మీతో గొడవ పెట్టుకున్న రవి?

ఈ షోలో యాంకర్ గా వ్యవహరించిన రవి.. షోలో రచ్చ చేశాడు. ఈ షోకు జీ తెలుగు సీరియళ్లలో నటించే నటీమణులు అందరూ వచ్చారు. యాంకర్ శ్యామలతో కలిసి హోస్ట్ గా వ్యవహరించిన రవి.. చేసిన హంగామా మామూలుగా లేదు. అయితే.. ఈ షోకు యాంకర్ రష్మీ గెస్ట్ గా వచ్చింది. ఈ నేపథ్యంలో.. జీ తెలుగు సీరియళ్ల నటీమణులతో కలిసి.. రష్మీ ఓ గేమ్ ఆడుతుండగా.. యాంకర్ రవి వాళ్లను అస్సలు ఆడనీయలేదు. వాళ్లను డిస్టర్బ్ చేసి స్టేజ్ దిగిపోయాడు.

దీంతో రష్మీ తట్టుకోలేక.. నువ్వు రా పైకి రా నీకు ఉంటది. నీకు ఉన్నది కూడా ఇప్పేస్తాం.. అంటూ రష్మీ అనగా.. సీరియళ్ల నటీమణులు అందరూ కలిసి.. రవిని స్టేజ్ మీదికి తీసుకొచ్చి చితకబాదారు. వామ్మో.. రవిని చితకబాదుతుంటే అక్కడున్న వాళ్లంతా అవాక్కయ్యారు. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ ప్రోమోను చూసి ఎంజాయ్ చేయండి.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూలై 23, 2021 at 6:51 సా.