anchor ravi in sixth sense 4 show
anchor ravi in sixth sense 4 show

Anchor Ravi : యాంకర్ రవి.. తెలుగు బుల్లితెర మీద తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. తెలుగు బుల్లితెర మీద ఎంతమంది యాంకర్స్ ఉన్నా.. రవికి ఉన్న క్రేజే వేరు. ఆయన చాలా సరదాగా ఉంటాడు. సరదాగా యాంకరింగ్ చేస్తుంటాడు. ఆయన ఏ షోలో ఉంటే.. ఆ షో మొత్తం నవ్వులు పూయాల్సిందే. ఆ షోకు వచ్చిన వాళ్ల మీద.. ఎవ్వరి మీద పడితే వాళ్ల మీద పంచ్ లు వేస్తూనే ఉంటాడు. స్పాంటెనిటీ కూడా ఎక్కువే. అందుకే.. యాంకర్ రవి అంటే అందరూ ఇష్టపడతారు.

anchor ravi in sixth sense 4 show
anchor ravi in sixth sense 4 show

తాజాగా యాంకర్ రవి sixth sense 4 షోకు గెస్ట్ గా హాజరయ్యాడు. ఆ షోకు యాంకర్ ఓంకార్ అని తెలుసు కదా. ప్రస్తుతం తెలుగు బుల్లితెర మీద sixth sense షో బాగానే క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం 4 వ సీజన్ విజయవంతంగా కొనసాగుతోంది. గెస్ట్ గా యాంకర్ రవితో పాటు యాంకర్ విష్ణుప్రియ కూడా ఈ షోకు హాజరు అయింది.

anchor ravi in sixth sense 4 show
anchor ravi in sixth sense 4 show

Anchor Ravi : షోలో రష్యన్ చీర్ గర్ల్స్ తో రచ్చ రచ్చ చేసిన రవి

Sixth sense షోలో చీర్ గర్ల్స్ చాలా స్పెషల్. ఎవరైనా ఏదైనా చాలెంజ్ లో గెలవగానే.. ఈ చీర్ గర్ల్స్ వెంటనే డ్యాన్స్ చేస్తారు. అయితే.. వీళ్లు ఇక్కడి వాళ్లు కాదు. రష్యన్ యువతులు. వీళ్లకు తెలుగు రాదు. వీళ్లతో Sixth sense షోలో తెలుగు పాటలు పాడిస్తారు. డ్యాన్స్ చేయిస్తారు. అయితే.. యాంకర్ రవి మాత్రం రష్యన్ గర్ల్స్ తో తెలుగులో మాట్లాడి.. బావా అనవా.. అంటూ వాళ్లను ఎటకారం చేశాడు. వాళ్లతో తెలుగులో మాట్లాడుతూ.. వాళ్లతో మాట్లాడించడం ఆధ్యంతం నవ్వును తెప్పిస్తుంది. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూలై 24, 2021 at 9:20 సా.