Anitha Chowdari : తెలుగులో ఒకప్పుడు పలు రకాల సీరియల్స్ అలాగే పలు రకాల ఇంటర్వ్యూలతో ప్రేక్షకులను బాగానే అలరించిన ప్రముఖ యాంకర్ మరియు నటి అనితా చౌదరి గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే యాంకర్ అనితా చౌదరి తెలుగులో ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన నువ్వే నువ్వే చిత్రం ద్వారా నటిగా తన సినీ కెరియర్ ఆరంభించింది. అయితే నటి అనితా చౌదరి కెరియర్ ప్రారంభించిన తొలినాళ్లలో తన నటనతో, యాంకరింగ్ తో బాగానే ఆకట్టుకుంది. ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహించిన చత్రపతి చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది.
కాగా ఈ చిత్రంలో నటి అనితా చౌదరి పాత్ర మంచి ఎమోషనల్ తో కూడి ఉండటంతో పాత్ర నిడివి తక్కువగా ఉన్నప్పటికీ మంచి గుర్త్మిపు లభించింది. కానీ ఆ తర్వాత నటి అనితా చౌదరి కొంతకాలంఆటీఓఓ సినిమాలకి బ్రేక్ ఇచ్చి కుటుంభ బాధ్యతలపై దృష్టి సారించింది. కాగా ఇటీవలే నటి అనితా చౌదరి ఓ ప్రముఖ యూట్యూబ్ చానెల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని తన వ్యక్తి గత జీవితం, ప్రేమ, పెళ్లి, వంటివాటిపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చెయ్యడంతో గత రెండు రోజులుగా నటి అనితా చౌదరి సోషల్ మీడియాలో బాగానే ట్రెండ్ అవుతోంది.
ఈ క్రమంలో నెటిజన్లు అనితా చౌదరి సోషల్ మీడియా ఖాతాలను గురించి అలాగే ఆమె వివరాల గురించి ఆరా తీయడం మొదలు పెట్టారు. అయితే ఈ మధ్య కాలంలో అనితా చౌదరి సోషల్ మీడియాలో బాగానే యాక్తీవ్ గా ఉంటోంది. ఈ క్రమంలో అప్పుడప్పడు ద్తనకు సంబందించిన అందమైన ఫోటోలు, వీడియోలు వంటివి షేర్ చేస్తూ నెటిజన్లను బాగానే ఆకట్టుకుంటోంది. కాగా ఇటీవలే పిల్లల దినోత్సవం కావడంతో నటి అనితా చౌదరి దగ్గరిలో ఉన్నటువంటి పిల్లల స్కూల్ కి వెళ్లి సరదాగా చిన్న పిల్లలతో గడిపింది.
ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఆమధ్య నటి అనితా చౌదరి స్విమ్మింగ్ పూల్ లో ఈదుతున్న ఫోటోలను కుడా షేర్ చేసింది. దీంతో ఈ ఫోట్లు కుడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ ఫోటోలపై కొందరు స్పందిస్తూ నటి అనితా చౌదరికి 45 ఏళ్ళ వయసు పైబడినా అందం ఏమాత్రం తగలేదని కామెంట్లు చేస్తున్నారు.