AP Politics: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నేడు తన సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు.ప్రస్తుతం నారా లోకేష్ అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో పాదయాత్ర చేపడుతున్న నేపథ్యంలో ఆయన పాదయాత్రకు సంఘీభావం తెలపడం కోసం బాలకృష్ణ హాజరయ్యారు. ఈ క్రమంలోనే బాలయ్యకు కొడికొండ చెక్పోస్ట్ వద్ద తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.ఒకరోజు పర్యటనలో భాగంగా ఈయన నారా లోకేష్ పాదయాత్రకు సంఘీభావం తెలిపిన అనంతరం హిందూపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
ఈ క్రమంలోనే పాదయాత్రకు ముందు మీడియాతో మాట్లాడినటువంటి బాలకృష్ణ జగన్ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు.ప్రస్తుతం లోకేష్ పాదయాత్రకు భారీ స్థాయిలో ఆదరణ లభిస్తుందని వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం అందుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.పాదయాత్రలో సంఘీభావం తెలిపిన అనంతరం ఈయన హిందూపురం చేరుకొని లయోలా కాలేజీలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. అనంతరం శ్రీకృష్ణదేవరాయ విగ్రహానికి పూలమాలలు వేసి స్థానిక టిడిపి నేతలు అనుచరులతో ఈయన సమావేశం అయ్యారు.
AP Politics: పాదయాత్రకు భారీ స్పందన…
ఇక మరోవైపు లోకేష్ పాదయాత్రకు అనంతపురంలో భారీ స్పందన లభిస్తుంది. ప్రస్తుతం ఈయన సింగనమల నియోజకవర్గం లో పాదయాత్రలో పాల్గొన్నారు. ఈయనకు సంఘీభావంగా ఉదయం బాలయ్య పాదయాత్రలో భాగంగా ఆయనతో పాటు పాదయాత్రలో పాల్గొన్నారు. ఇక వచ్చే ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వం సరికొత్త వ్యూహాలను రక్షిస్తూ ముందుకు వెళుతున్న విషయం తెలిసిందే.