AP TET 2022 రేపటి తరాన్ని వారి భవిష్యత్తును మార్చే ఉపాధ్యాయులను దేవునితో సమానం అని మన పూర్వికులు నుంచి మనం వింటూనే ఉన్నాం. అయితే అటువంటి ఉపాధ్యాయులకు అర్హత నిమిత్తం ఏపీ ప్రభుత్వం టెట్ నిర్వహణకు సర్వం సిద్ధం చేశారు. టెట్ (Teachers Eligibility Test) నోటిఫికేషన్‌ను జూన్ 10 విడుదల విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. జూన్ 15 నుంచి జూలై 15 వరకు దరఖాస్తు దారులు ఆన్‌లైన్‌లో ఫీజుల చెల్లింపు కోసం అవకాశం కల్పించింది.ఆగస్టు 6 నుంచి 21 వరకు ఆన్‌లైన్‌లో ఏపీ టెట్ పరీక్షలు నిర్వహించినట్లు మరియు ఆగస్టు 31న టెట్ కీ విడుదల చేసి, సెప్టెంబర్ 14న ఫలితాలు విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు.
ఈ పరీక్ష విధానం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏపీ ప్రభుత్వం నిర్వహించనుంది దీనికి సంబంధించి టెట్ హాల్ టికెట్లు విడుదల చేసింది . నేటి నుండి అభ్యర్థులు https://cse.ap.gov.in/ లేదా https://aptet.apcfss.in/ వెబ్‌సైట్ నుంచి తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.ఆగస్టు 6 నుంచి 21వ తేదీ వరకు ఏపీ టెట్ 2022 పరీక్ష విధానాన్ని నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష ఉదయం మరియు సాయంత్రం సెక్షన్స్ లో నిర్వహించనున్నారు.ఆగస్టు 6 శనివారం సెషన్ 1 ప్రారంభం కాగా, ఆగస్టు 21 ఆదివారం సెషన్ 22లో షిఫ్ట్ 2తో ఏపీ టెట్ పరీక్షలు పూర్తవనున్నాయి. ఏపీలోని అన్ని జిల్లా కేంద్రాలతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో ఎగ్జామ్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది.
అభ్యర్థులు తమ హాల్ టికెట్ ను ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవలెను.
అధికారిక వెబ్‌సైట్ లో లింక్ ఓపెన్ చేశాక, క్యాండిడేట్ ఐడీ, పుట్టిన తేదీ, వెరిఫికేషన్ కోడ్ వివరాలతో అభ్యర్థులు లాగిన్ అవ్వాలి.
ఆ తరువాత తమ వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేస్తే స్క్రీన్ మీద హాల్ టికెట్ కనిపిస్తుంది.
అప్పుడు పీడీఎఫ్ రూపంలో డౌన్ లోడ్ చేసుకుని, ఆపై ప్రింటౌట్ తీసుకోవాలని అభ్యర్థులకు సూచించారు.
ఏపీ టెట్ పేపర్-2A అర్హతలో కొన్ని మార్పులు చేసినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు డిగ్రీలో 40 శాతం మార్కులు వచ్చిన వారు పేపర్-2Aకి అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఈసారికి మాత్రమే సడలింపు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూలై 26 నుంచి పాఠశాల విద్యాశాఖలో మాక్ టెస్ట్ రాయొచ్చని సూచించింది.