ఏప్రిల్ నెల అంటే చాలామంది ఎండలకి భయపడతారు. కానీ సినీ ప్రియులు మాత్రం ఈ నెలలో రాబోయే సినిమాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే పరీక్షలు రాసి అలసిపోయిన విద్యార్థులకు కూడా ఈ సినిమాలు ఒక ఆటవిడుపు. అందుకు తగ్గట్టుగానే ముస్తాబయింది టాలీవుడ్ సినీ పరిశ్రమ. మరి ఈ నెలలో వచ్చే సినిమాలు ఏంటో ఒకసారి చూద్దామా?
ఇక ఈ నెలలో విడుదలయ్యే సినిమాల్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గది మనం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సినిమా శాకుంతలం. సమంత కథానాయకగా నటించిన ఈ సినిమా మీద ప్రేక్షకులకు భారీ అంచనాలే ఏర్పడ్డాయి. మణిశర్మ సంగీతం గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత, దేవ్ మోహన్, మోహన్ బాబు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదలకు సిద్ధంగా ఉంది. అదే 14 తారీకున రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న మరొక సినిమా రుద్రుడు. లారెన్స్ రాఘవ నుంచి చాలా రోజుల తర్వాత వస్తున్న యాక్షన్ త్రిల్లర్ ఈ సినిమా.
జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమాకి దర్శకత్వం కదిరేసన్.ఇదే ఏప్రిల్ నెలలో విడుదలకు సిద్ధంగా ఉన్న మరో పెద్ద సినిమా రవితేజ హీరోగా నటించిన రావణాసురుడు.
ఇది ఏప్రిల్ 7 తారీఖున రిలీజ్ కి సిద్ధంగా ఉంది. సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ గా వస్తున్న ఈ సినిమాలో రవితేజ తో పాటు సుశాంత్, అను ఇమ్మానుయేల్, దక్ష నగర్కర్, మేఘా ఆకాష్ తదితరులు ప్రధాన పాత్ర పోషించారు ఈ సినిమా ఏప్రిల్ 7 న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదే 7వ తేదీన విడుదలవుతున్న మరో సినిమా 1947 ఆగస్టు 16. స్వాతంత్రం వచ్చిన తరువాత ఏం జరిగింది అనే కథాంశంతో వస్తున్న ఈ సినిమాలో గౌతమ్ కార్తీక్, పూజ రేవతి తదితరులు నటించారు.
సీన్ రాల్డెన్ సంగీతం అందించిన ఈ సినిమాకి ఎన్ ఎస్ పొన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఇక అదే రోజు కిరణ్ అబ్బవరం నటించిన మీటర్ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. కిరణ్ అబ్బవరం తో పాటు అతుల్య రవి సప్తగిరి కృష్ణ మురళి వంటి వారు ప్రధాన పాత్రలు పోషించారు. సాయి కార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమాకి రమేష్ కాడూరి దర్శకత్వం వహించారు.
మరోవైపు బెల్లంకొండ గణేష్ హీరోగా వస్తున్న నేనే స్టూడెంట్ సర్ సినిమాతో పాటు హలో మీరా, పోనియన్ సెల్వం2, అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్, సాయి ధరంతేజ్ విరూపాక్ష సినిమాలు విడుదలకి సిద్ధంగా ఉన్నాయి. సినీ ప్రియులకు ఈ నెల అంతా పెద్ద పండగే.