Ariyana Glory : బిగ్ బాస్ 5 లోకి అరియానా గ్లోరీ? తనను మళ్లీ ఎందుకు తీసుకున్నారంటే?

Ramesh J

Ariyana Glory : అరియానా గ్లోరీ తెలుసు కదా. తను ఎక్కడుంటే అక్కడ గోలే. వసపిట్టలా వాగుతూనే ఉంటుంది అరియానా గ్లోరీ. బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ కూడా. టాప్ 5 కంటెస్టెంట్ కూడా. అరియానా గ్లోరీకి బిగ్ బాస్ 4 సీజన్ తోనే మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అరియానా గ్లోరీ బిగ్ బాస్ 4లో బెస్ట్ కంటెస్టెంట్ గా నిలిచి.. మెగాస్టార్ చిరంజీవితోనే శెభాష్ అనిపించుకుంది.

ariyana glory as bigg boss 5 telugu buzz host
ariyana glory as bigg boss 5 telugu buzz host

ఇక.. అరియానా గురించి మరోసారి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. మరోసారి బిగ్ బాస్ 5 లోకి అరియానాను తీసుకుంటున్నారు.. అని. ఇప్పటికే తను బిగ్ బాస్ 4 లో కంటెస్టెంట్ గా చేసింది కదా. మళ్లీ ఎందుకు తనను బిగ్ బాస్ 5 లోకి తీసుకుంటున్నారు అంటారా? తను వెళ్లేది బిగ్ బాస్ హౌస్ లోకి కాదు. బిగ్ బాస్ 5 బజ్ షోకి హోస్ట్ గా.

ariyana glory as bigg boss 5 telugu buzz host
ariyana glory as bigg boss 5 telugu buzz host

Ariyana Glory : బిగ్ బాస్ 4 సీజన్ బజ్ హోస్ట్ గా రాహుల్ సిప్లిగంజ్.. బిగ్ బాస్ 5 బజ్ హోస్ట్ గా అరియానా

అయితే.. బిగ్ బాస్ 4 సీజన్ సమయంలో.. బజ్ షోకు హోస్ట్ గా బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ను తీసుకున్నారు. బిగ్ బాస్ 5 సీజన్ బజ్ హోస్ట్ గా బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ అరియానాను తీసుకున్నారట. ఇప్పటికే తన ట్రయల్ షూట్ కూడా అయిపోయిందట. ఇక.. మొదటి వారం నుంచి ఈ షోలో బయటికి వెళ్లిపోయిన వారి ఇంటర్వ్యూను తీసుకోవడమే ఈ బజ్ షో ప్రత్యేకత. ఎలాగూ.. అరియానాకు ఇంటర్వ్యూలు తీసుకోవడం సహజమే కాబట్టి.. తననే సెలెక్ట్ చేసిందట బిగ్ బాస్ యాజమాన్యం.

ariyana glory as bigg boss 5 telugu buzz host
ariyana glory as bigg boss 5 telugu buzz host

- Advertisement -