Ariyana : తెలుగులో ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ ఇంటర్వ్యూ లతో ఓవర్ నైట్ లో పాపులర్ అయిన వారిలో తెలుగు యంగ్ బ్యూటీఫుల్ యాంకర్ మరియు నటి అరియానా గ్లోరీ ముందుంటుందని చెప్పవచ్చు. అయితే నటి అరియానా గ్లోరీ ఈ మధ్య సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తన అభిమానులకు అందాల విందు చేస్తోంది. కాగా ప్రస్తుతం అరియానా గ్లోరీ తెలుగులో ప్రముఖ ఎంటర్టైన్ మెంట్ చానెల్ అయిన స్టార్ మా చానెల్ లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ జోడీ అనే డాన్స్ షో కాంపిటీషన్ షో లో పాల్గొంటున్న సంగతి అందరికీ తెలిసిందే.
ఇందులో బాగంగా మరో మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన ముక్కు అవినాష్ తో కలసి స్టెప్పులేస్తూ ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది. ఈ క్రమంలో ఆమధ్య నందమూరి బాలకృష్ణ నటించిన లక్స్ పాప పాటకి స్టెప్పులేస్తూ ఆడియెన్స్ ని బాగానే మెప్పించారు . అయితే తాజాగా నటి అరియానా గ్లోరీ సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని ఫోటోల కరణగా బాగానే వైరల్ అవుతోంది. అయితే నటి అరియానా గ్లోరీ ఈ బిగ్ బాస్ జోడీ లో భాగంగా శాకుంతలం చిత్రంలో సమంతా రూత్ ప్రభు వేసిన గెటప్ లో కనిపించింది.
అలాగే ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో కొందరు అరియానా గ్లోరీ ఈ ఫోటోలకు ఫిధా అయినప్పటికీ మరికొందరు మాత్రం సమంత గెటప్ వేసినంత మాత్రాన సమంతా అయిపోరని, కబతి ఇలాంటి స్టంట్లు తగ్గిస్తే మంచిదంటూ నెగిటివ్ గా కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయం ఇలా ఉండగా ఆర్జీవి ఇంటర్వ్యూ, బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షో, వంటి వాటితో బాగానే పాపులర్ అయిన అరియానా గ్లోరీ ప్రస్తుతం వరుస ఈవెంట్లు, షోలు అంటూ బిజీ బిజీ గా గడుపుతోంది.