Ashwini Dutt: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో సినీ సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా స్పందిస్తూ చంద్రబాబు నాయుడు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ క్రమంలోనే నిర్మాత అశ్విని సైతం చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంపై స్పందిస్తూ ఏపీ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అరెస్టు కేవలం కక్ష సాధింపు చర్య మాత్రమేనని తెలియజేశారు. మన దేశానికి ఎంతో గొప్ప రాష్ట్రపతులను ప్రధాన మంత్రులను స్పీకర్లను పరిచయం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది.
అలాంటి ఒక గొప్ప వ్యక్తిని ఏ విధమైనటువంటి ఆధారాలు లేకుండా ఉద్దేశపూర్వకంగానే తనని జైల్లో పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇలా తనని ఇబ్బందులకు గురి చేసే వారికి పుట్టగతులు ఉండవు అంటూ ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఇలా చంద్రబాబు నాయుడు పై తప్పుడు అబండాలు మోపి జైలుకు పంపించిన వారికి త్వరలోనే గుణపాఠం తప్పదని ఈయన తెలిపారు. చంద్రబాబు నాయుడు త్వరలోనే జైలు నుంచి బయటకు వస్తారని వచ్చే ఎన్నికలలో 175కు గాను 160 సీట్ల మెజారిటీతో గెలుపొంది మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని ఈయన తెలిపారు.
ఇబ్బందులలో ప్రభాస్ కల్కి…
అశ్విని దత్ ఇదే కాకుండా ఇదివరకు కూడా నంది అవార్డుల విషయంలో ఏపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ గుండాలు ఉత్తమ రౌడీలకు నంది అవార్డులు ప్రకటిస్తున్నారు అంటూ ఈయన ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇలా పలుమార్లు ఏపీ ప్రభుత్వాన్ని గెలుకుతున్నటువంటి ఈయన తన మాటలతో ప్రభాస్ సినిమాను ఇబ్బందులలో పడే బోతున్నారని అభిమానులు భావిస్తున్నారు. ఈయన నిర్మాణంలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా కల్కి సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈయన మాటలు ప్రభాస్ సినిమాని ఇబ్బందులలో పడేయబోతున్నాయని ఆ విషయాలన్నింటిని దృష్టిలో పెట్టుకొని అశ్విని జాగ్రత్తగా వ్యవహరిస్తే బాగుంటుందంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఈ విషయంపై కామెంట్లు చేస్తున్నారు.