Bandla Ganesh: టాలీవుడ్ ప్రేక్షకులకు నిర్మాత బండ్ల గణేష్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో పలు సినిమాలకు నిర్మాతగా వహిస్తూ .. కొన్ని సినిమాల్లో సహాయ పాత్రలు చేస్తూ నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. నిత్యం పవన్ కళ్యాణ్ ధ్యానంలో ఉంటూ అతడిపై మాట పడకుండా పవన్ కళ్యాణ్ భక్తుడు లా ప్రవర్తిస్తూ ఉంటాడు.
ఇక ఏదో ఒక వివాదాన్ని తట్టి లేపడం బండ్ల గణేష్ కి సాధారణంగా ఉన్న అలవాటే.. ఇక నేను పవన్ కళ్యాణ్ భక్తుడిని అంటూ స్టేజ్ పై బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ గురించి ఎంతో గొప్పగా చెబుతుంటాడు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో ఇప్పటికే వైరల్ గా మారాయి. ఇలా బండ్ల గణేష్ స్పీచ్ కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు.
ఇక రాజకీయంగా మాత్రం బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ.. వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుతూ ఉంటాడు. ఇక పవన్ పార్టీలోకి రావాలని కోరితే ఏ మాత్రం ఆలోచించకుండా జనసేన పార్టీలోకి వచ్చేస్తాను అని బండ్ల గణేష్ పలు ఇంటర్వ్యూలలో చెబుతూ వచ్చాడు.
ఇక పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసే వారి మీద విరుచుకు పడుతూ ఉంటాడు. ఇక ఇదే క్రమంలో తాజాగా ఒక నెటిజన్ పై విరుచుకు పడ్డాడు. వంగి వంగి దండాలు పెట్టడానికి నేను రాజకీయాల్లోకి రాలేదు అని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కి ఒక నెటిజన్ ప్రముఖ రాజకీయ నాయకులకు పవన్ కళ్యాణ్ వంగి దండాలు పెట్టిన వీడియోను ట్రోల్ చేసాడు.
Bandla Ganesh: బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కి యాంటీ ఫ్యాన్స్ ను ఈ విధంగా క్రియేట్ చేస్తున్నాడు!
దానికి బండ్ల గణేష్ ఒక రేంజ్ లో కోపం వ్యక్తం చేశాడు. పెద్దలకు నమస్కారం చేయడం మన సంస్కారం రా లఫూట్ అని చెప్పను అని తన ట్విట్టర్ ఖాతాలో ఒక ట్వీట్ ద్వారా తెలియచేసాడు. ఇక ఈ ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు ఎవరో ఒక నెటిజన్ పవన్ కళ్యాణ్ పై నెగిటివ్ గా స్పందిస్తే.. దాన్ని వెలుగులోకి తీసుకుని వచ్చి మరి బండ్ల గణేష్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నట్లు అనుకుంటున్నారు. అంతేకాకుండా బండ్లగణేష్ కావాలంటే పవన్ కళ్యాణ్ కు యాంటీ ఫ్యాన్స్ క్రియేట్ చేస్తున్నట్లు కొందరు నెటిజన్లు అనుకుంటున్నారు.