Bigg Boss 5 బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 ఆద్యంతం ఆసక్తిగా సాగుతూ ప్రేక్షకులను అలరిస్తుంది. 16 మంది కంటెస్టెంట్లుతో ఈ సీజన్ ప్రారంభం అవ్వగా… మొదటి వారం సరయు, రెండో వారం ఉమాదేవి… మూడో వారంలో లహరి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. అయితే లహరి ఎలిమినేట్ అవ్వడం… అందరినీ షాక్ కు గురిచేసింది అనే చెప్పాలి. అసలు ఎవరూ ఊహించని రీతిలో ఆమె హౌస్ నుంచి నిష్క్రమించడం మింగుడు పడని అంశమే. యాంకర్ రవినే దీనికి గల కారణం అంటూ లహరి … పరోక్షంగా విమర్శలు కూడా చేసింది. అయితే ఆమెకు కాస్త ఆవేశం ఎక్కువగా ఉంటుందనేది తెలిసిందే. ఆవేశాన్ని తగ్గించుకోవాలమ్మా అని నాగార్జున అంటే… తను రైట్ ఉంటేనే మాట్లాడుతా సర్… లేదంటే అస్సలు మాట్లాడను అంటూ బదులు ఇచ్చింది ఈ అమ్మడు.
లహరి ఎలిమినేట్ అయ్యి… మరో ఎలిమినేషన్ కి రోజులు దగ్గర పడిన సంధర్బంలో … ఇప్పుడు మళ్ళీ ఆమె గురించి చర్చించడం ఎందుకు అని అనుకుంటున్నారా … కానీ మాట్లాడాల్సిన అవసరం మళ్ళీ వచ్చేలా చేశారు. అలా చేసింది ఎవరూ అని అనుకుంటున్నారా అతనే … బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్. లహరి ఎలిమినేషన్ పై… ఆయన తీవ్రంగా స్పందించాడు. బిగ్ బాస్ నిర్వాహకులు చాల పెద్ద తప్పు చేశారంటూ అతను విమర్శించారు. లహరిని ఎలిమినేట్ చేయడం అనేది సరికాదని… ఆమెను అన్యాయంగా బయటకు పంపించారని కౌశల్ అభిప్రాయపడ్డాడు.
లహరిని రీ ఎంట్రీ ద్వారా మళ్లీ హౌస్ లోకి పంపాలని ఆయన కోరాడు. ఈ నేపధ్యంలో లహరితో కలిసి దిగిన ఫొటోను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో కౌశల్ పోస్ట్ చేశాడు. హౌస్ లో నీ వైఖరి బాగుంది… కానీ ఇంత త్వరగా బయటకు వచ్చేస్తావని అనుకోలేదని ఆయన పోస్ట్ లో రాయడం జరిగింది. అలానే ‘లహరి కమ్ బ్యాక్ ’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా కౌశల్ పెట్టడంతో… ఆమె అభిమానులు కూడా లహరి రీ ఎంట్రీ ఇవ్వాలంటూ కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. త్వరలో ఆమెతో ఇంటర్వ్యూ కూడా చేయనున్నాడు… ఇందుకు సంబంధించినా ప్రోమోను కూడా విడుదల చేశాడు కౌశల్. ప్రస్తుతం ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.