Bigg Boss Siri బిగ్ బాస్ 5 బ్యూటీ సిరికి కరోనా పాజిటివ్… షణ్ముఖ్ రియాక్షన్ ఏంటంటే ?

Jaya Kumar

Bigg Boss Siri కరోనా మహమ్మారి మళ్ళీ కోరలు చాస్తుంది. ఏ ఒక్కరినీ కనికరించకుండా సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల దాకా అందరినీ తన బాధితులుగా చేర్చుకుంటోంది. ముఖ్యంగా చిత్ర పరిశ్రమకు చెందిన వారిని నీడలా వెంటాడుతోంది ఈ మహమ్మారి. ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా బారిన పడి ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా బిగ్ బాస్ బ్యూటీ సిరి హన్మంతు కరోనా బారిన పడ్డట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. స్వల్ప లక్షణాలతో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు సిరి ఇంస్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది. దీంతో ఆమె అభిమానులు అంతా ఆమెకి మనో ధైర్యాన్నిస్తున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తు పోస్ట్ లు పెడుతున్నారు.

కాగా గతంలో కొన్ని షార్ట్ ఫిలిమ్స్, యూట్యూబ్ వీడియోల్లో నటించిన ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకుంది సిరి. ఇక బిగ్ బాస్ సీజన్- 5 లో టాప్- 5 కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచింది. అయితే హౌస్ లో ఆటకంటే షణ్ముఖ్ తో రిలేషన్ షిప్ లో ఉందన్న రూమర్స్ తోనే ఎక్కువ పాపులర్ అయ్యింది ఈ భామ. తాము మంచి స్నేహితులమని చెప్పుకున్నా వారి ప్రవర్తన చాలామందికి నచ్చలేదు. ఈ క్రమంలోనే షన్నుతో బ్రేకప్ చెప్పేసింది దీప్తి సునయన. వీరిద్దరూ విడిపోవడానికి కారణం సిరినే అని సోషల్ మీడియాలో ప్రచారం కూడా సాగింది. ఈ నేపథ్యంలో షన్ను- దీప్తి బ్రేకప్ కి కారణం తాను కాదని తేల్చి చెప్పింది సిరి. మరోపక్క సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ కూడా ఆమెను దూరం పెట్టినట్లు తెలుస్తోంది.

మరోవైపు సినిమా ఇండస్ట్రీలో కరోనా మూడో వేవ్ కేసులు కూడా వేగంగా పెరుగుతున్నాయి. కరోనా మూడో వేవ్ ఇంత వేగంగా వ్యాప్తి చెందుతుందని అసలు ఎవరూ ఊహించిఉండరు. ఇప్పటికే మహేష్ బాబు కరోనా నుంచి కోలుకొని ఉండగా… కీర్తి సురేష్, రాజేంద్రప్రసాద్, బండ్ల గణేష్, మంచు మనోజ్, లక్ష్మి ప్రసన్న, హీరోయిన్ డింపుల్ హయతి, కమెడియన్ విద్యుల్లేఖా రామన్ శోభన ఇలా అందరూ కరోనాతో హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. పైగా నటీనటులకు వరుసగా కరోనా పాజిటివ్ వస్తుండటంతో… ఏం చేయాలో తెలియక సినిమా మేకర్స్ మళ్ళీ ఆందోళనలో పడ్డారు.

- Advertisement -