Ariyana అరియానా గ్లోరీ అంటే తెలుగు ప్రేక్షకుల్లో తెలియని వారుండరు. యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ అమ్మడు ఆర్జీవితో ఇంటర్వ్యూ చేయడం ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. బోల్డ్ బ్యూటీగా ఎంట్రీ ఇచ్చి సింగిల్ గేమ్ ఆడుతూ ఫైనల్ వరకు దూసుకొచ్చింది ఈ భామ. దాదాపు 15 వారాలు ఇంట్లో సక్సెస్ ఫుల్ గా ఆటాడిన అరియానా… ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మను మరోసారి ఇంటర్వ్యూ చేసి సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఇదిలా ఉంటే తాజాగా ఆరియానా యంగ్ హీరో రాజ్ తరుణ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.
యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రధాన పాత్రలో ఇటీవల అనుభవించు రాజా అనే సినిమాలో నటించింది. ఇందులో అరియానా కీలక పాత్రలో నటించింది. ఇటీవల విడుదలైన ఈ మూవీ మంచి టాక్ సంపాదించుకుంది. ఈ సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో అరియానాతో పాటు హీరో, డైరెక్టర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరియానా మాట్లాడుతూ… తనకు ఒకప్పుడు రాజ్ తరుణ్ అంటే అసలు ఇష్టం ఉండేది కాదని, తనతో సినిమా ఎలా చేశానో అర్థం కావట్లేదని తెలిపింది. టీవీలో తన సినిమాలు వస్తే తీసేయాలని చెప్పేదాన్ని అని రాజ్ తరుణ్ కారులో వెళ్తుంటే తనకు యాక్సిడెంట్ కావాలని కోరుకున్నట్లు చెప్పింది.
దీంతో ఎందుకు రాజ్ తరుణ్ అంటే అంత కోపం అని అడగ్గా ఇలా ఒక ఇంటర్య్వుకు పిలిచారు. అప్పుడు చాలా సేపు వెయిట్ చేయించాడు, నా ముందే కారులో వెళ్తుంటే హీరో ఏంటీ వెళ్లిపోతున్నాడని అడిగాను అని చెప్పింది. డబ్బింగ్ కరెక్షన్ ఉందని వెళ్తున్నట్లు చెప్పారని ఆరియానా వివరించింది, ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేసిన వ్యక్యాలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.